Nindu Noorella Saavasam November 07 episode 74: ఏమైంది నిర్మల అంటూ శివరామ్ అడుగుతాడు. ఏమోనండి నాకు తెలియదు మిస్సమ్మ వచ్చి గబగబా కిచెన్ నుంచి బయటికి తీసుకువచ్చింది అని నిర్మల అంటుంది. మిస్సమ్మ అసలు ఏం జరిగింది ఏంటి అని మనోహరి అంటుంది. ఎవరో కిచెన్ లో గ్యాస్ ఓపెన్ చేశారు అది తెలియక ఆంటీ కిచెన్ లోకి వెళ్ళింది అందుకే పరిగెత్తుకొచ్చి ఆంటీని బయటకు తీసుకొచ్చాను అని భాగమతి చెప్తుంది. అది సరే మిస్సమ్మ కిచెన్ లో గ్యాస్ ఓపెన్ చేశారని నీకు ఎవరు చెప్పారు అని మనోహరి అంటుంది. పక్కింటి ఆవిడ చెప్పింది కాబట్టి మిమ్మల్ని కాపాడగలిగాను థాంక్స్ ఆవిడకే చెప్పండి అని భాగమతి అంటుంది. పక్కింటి ఆవిడ ఎవరమ్మా నిన్నగాక మొన్న వచ్చావు నీకు పక్కింటి ఆవిడ ఎవరు పరిచయమయ్యారు ఆవిడను మేము ఒక్కసారి కూడా చూడలేదే అని మనోహరి అంటుంది. అది సరే పక్కింటి వాళ్ళని పిలుసుకు వస్తాను అందులో నీకు చెప్పిన ఆవిడ ఎవరో చూపించు అని రాథోడ్ అంటాడు. ఆ పని చెయ్ రాథోడ్ అందర్నీ పిలుచుకురా అని నిర్మల అంటుంది.

రాథోడ్ వెళ్లి అందరిని పిలుచుకు వస్తాడు ఇందులో నీతో మాట్లాడే ఆవిడ ఎవరో చూపించమ్మా అని రాథోడ్ అంటాడు. వాళ్లందర్నీ చూసిన భాగమతి వీళ్ళలో ఆవిడ లేదండి అని అంటుంది. నన్ను కాపాడిన అమ్మాయికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకునే అదృష్టం కూడా లేదు అని నిర్మల అంటుంది. వీళ్లు తప్ప మన పక్కింట్లో గాని ఎదిరింట్లో గాని ఇంక ఎవరూ లేరమ్మా ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తన పోలికలు చెప్పు అని శివరామ్ అంటాడు. ఐదు అడుగుల హైట్ ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళు గడ్డం కింద ఒక పుట్టుమచ్చ ఉంటుంది చూడడానికి చాలా అందంగా తెల్లగా ఉంటుంది అని భాగమతి చెప్తుంది. ఆపు నువ్వు చూసిన పక్కింటి ఆవిడ గురించి చెప్పమంటే నా ఫ్రెండ్ గురించి చెప్తావు ఏంటి అని మనోహరి అంటుంది. మొన్న కూడా నాతో మన మేడం పోలికలే చెప్పింది కానీ నేను మన మేడం లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారేమోలే అని మళ్ళీ అడగలేదు అని రాథోడ్ అంటారు. సార్ భార్య ఎలా ఉంటుందో నాకు ఎలా తెలుసండి అని భాగమతి అంటుంది. సరేలే ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు అని శివరామ్ నిర్మల వెళ్లిపోతారు. కట్ చేస్తే గుప్తా గారు అని అరుచుకుంటూ అరుంధతి గుప్తా దగ్గరికి వెళ్తుంది. ఏంటి బాలిక ఆ అరుపులు ఏది జరగవలనని ఉన్నదో అదే జరుగును నీవెందుకు ఇంతలా ఆరాటపడుతున్నావు అని గుప్తా అంటాడు.

అవునా అని అరుంధతి తన మెడకు ఉన్న టవల్ తొ గుప్తా మెడకు వేసి గట్టిగా బిగదీస్తుంది. నొప్పికి తట్టుకోలేక గుప్తా గారు అమ్మ అని అరుస్తాడు. ఏంటి గుప్తా గారు అరుస్తున్నారు ఏది జరిగితే అదే జరుగుతుందని ఊరుకోవచ్చు కదా అని అరుంధతి కోపంగా అంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అమరేంద్ర ఎలాగైనా ఆరు చెప్పిన అమ్మాయిని కలవాలని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఎక్స్క్యూజ్మీ ఆర్జి భాగ్యం గారిని పిలుస్తారా అని అంటాడు. ఆవిడ ఇక్కడ పని చేయట్లేదండి మానేసింది అని మేనేజర్ అంటాడు.అవునా ఎలాగైనా ఈరోజు ఆవిడని కలవాలని వచ్చానండి అని అమరేంద్ర అంటాడు. ఎందుకండీ తనకి ఫోన్ చేయకపోయారు అని మేనేజర్ అంటాడు. ఫోన్లో మాట్లాడితే కలవడం కుదరట్లేదు అండి అందుకే డైరెక్ట్ కలుద్దామని వచ్చాను అని అమరేంద్ర అంటాడు.

అవునా నేను ఇక్కడికి పిలిపిస్తాను మీరు ఇక్కడే కూర్చోండి అని మేనేజర్ భాగమతికి ఫోన్ చేసి నిన్ను కలవడానికి ఎవరో వచ్చారమ్మా ఆఫీస్ కి ఒకసారి రాగలవా అని మేనేజర్ అంటాడు. నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను ఇప్పుడు రాలేను సార్ అని భాగమతి ఫోన్ పెట్టేస్తుంది. చూడండి సార్ తను ఏదో పనిలో ఉందంట రాలేను అంటుంది మేము ఇక్కడ పని చేసినప్పుడు గ్రూప్ ఫోటో దిగాము ఉండండి చూపెడతాను అని మేనేజర్ ఫోన్లో ఫోటో లేదండి ఫోన్ పోయింది మీ నెంబర్ ఇవ్వండి ఇంటికి వెళ్లాక చూసి మీకు సెండ్ చేస్తాను అని మేనేజర్ అంటాడు. థాంక్స్ అండి అని అమరేంద్ర తన నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అమ్మో ఈవిడ బుర్రకి పని చెప్తుంది అంటే ఇంట్లో ఎవరికో మూడింది అంటూ నీలా వచ్చి ఏంటమ్మా గారు ఏదో ఆలోచిస్తున్నారు అని అంటుంది. ఏమీ లేదే నీలా మిస్సమ్మకి ఎవరో హెల్ప్ చేస్తున్నారు ఆవిడ ఎవరో తెలుసుకోవాలి ఎన్నిసార్లు ప్రయత్నించినా అతను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేకపోతున్నాను ఆర్జీ భాగమతి మిస్సమ్మ అని తెలిస్తే ఇక నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేను ఆలోపే ఏదో ఒక ప్లాన్ చేసి దాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అని మనోహరి అంటుంది.

మనం అనుకుంటాం కానీ ఏది మనం అనుకున్నట్టు జరగట్లేదమ్మా అని నీలా అంటుంది. కట్ చేస్తే, అంజు పాపా చిన్న చిన్న వాటికి కూడా నువ్వు ఆన్సర్ చెప్పట్లేదు ఇలా అయితే ఎలాగమ్మా నిన్ను బాగా చదివించి ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తానని మేడం తో ఛాలెంజ్ చేశాను ఇప్పుడు ఎలా అని భాగమతి అంటుంది. నువ్వు అడిగి ఛాలెంజ్ చేసావా మిస్సమ్మ నువ్వు ఏమి ఆలోచించకుండా చాలెంజ్ చేశావు దాంట్లో నా తప్పేముంది అని అంజు అంటుంది. చూడు అంజు పాపా ఇంత చెప్పినా నువ్వు చదవట్లేదు కదా స్కూల్ కి వెళ్లి ఏం చేస్తావు మరి అని భాగమతి అంటుంది. స్కూలుకి వెళ్లి అల్లరి చేస్తాను ఆడుకుంటాను మేడం చూసి బయటికి గెంటేస్తే బయట నిలబడి ఎంజాయ్ చేస్తాను అని అంజు అంటుంది.

చూడు అంజు ఇప్పటినుంచి ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు నువ్వు ఎలాగైనా సరే చదివి ఎగ్జామ్ లో మార్కులు తెచ్చుకోవాల్సిందే అని భాగమతి అంటుంది. నేను బుద్ధిగా స్కూల్ కి వెళ్ళను అప్పుడప్పుడు డుమ్మాలు కొడతాను కానీ బాగా చదవలేను అంతలా చదివితే స్కూల్ మారే అవసరం ఏముంటుంది చెప్పు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు మిస్సమ్మ అని అంజు అంటుంది. అవును కదా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యానబ్బా లేదంటే ఇంత తిప్పలు వచ్చేది కాదు కదా అని భాగమతి అంటుంది. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా అంజు వేసిన డ్రాయింగ్ లేసి వచ్చి భాగమతి మొహం మీద పడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది