Madhuranagarilo Latest Episode 179: పంతులు గారు చెప్పినట్టు ఆ పరిహార పూజ ఏదో చేద్దాము అంతే కానీ మీరేమీ వర్రీ కావొద్దు రాధా నాకు ఆఫీస్ కి టైం అయింది వెళ్లి లాప్టాప్ తీసుకురా అని రాదని పంపిస్తాడు శ్యామ్. సరే అని రాదా వెళ్లిపోతుంది.అమ్మ ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా అని శ్యామ్ అంటాడు. అసలు ఆ అమ్మాయి ఎవర్రా ఆ అమ్మాయి పేరు ఏంటి అని మధుర అంటుంది. ఆ అమ్మాయి పేరు రుక్మిణి అమ్మ వాళ్ళ ఊరు కేసముద్రం అని శ్యామ్ అంటాడు. అది రాధ వాళ్ళ ఊరు కదా అని రాదని పిలవబోతోంది మధుర.

అమ్మ నా మొదటి భార్య గురించి రాదా దగ్గర మాట్లాడితే తనకు బాధేస్తుంది మీరు ఇంకెప్పుడు తన దగ్గర మాట్లాడకండి అని శ్యామ్ అంటాడు. ఇంతలో రాదా లాప్టాప్ తెచ్చి శ్యామ్ కి ఇస్తుంది శ్యామ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఏవండీ రాధా వాళ్ళది కేసముద్రమే కదా రాధ వాళ్ళ నాన్నని రుక్మిణి గురించి అడిగితే ఏమైనా చెప్తాడేమో అని మధుర అంటుంది. కట్ చేస్తే కోపంగా సంయుక్త వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సంయుక్త ఏంటి ఇలా సడన్గా వచ్చావు అని వాళ్ళ అమ్మ అంటుంది. సునామీలు సడన్ గానే వస్తాయి ఫోన్ చేసి రావు అని సంయుక్త అంటుంది. శ్యామ్ ని రాదని విడగొడితే కానీ అక్కడ నుంచి రాను అన్నావు కదా సడన్గా వచ్చావ్ ఏంటి అని అంటున్నాను అని వాళ్ళ అమ్మ అంటుంది.

నేను ఎక్కడున్నాను అన్నది కాదు ముఖ్యంగా రాదని శ్యామ్ ని విడగొట్టడం ఇక నుంచే మొదలు పెడతాను ఎలాగైనా రాదని శ్యామ్ ని విడగొడతాను ఆ ఇంటికి కోడలుగా అడుగు పెడతాను నువ్వేమీ టెన్షన్ పడకు అమ్మ అని సంయుక్త లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఏంటండీ ఏదో ఆలోచిస్తున్నారు అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. రాదని ఆ దుర్మార్గుడు నుంచి ఎలా కాపాడాలి అని అనుకుంటున్నాను అని రాధ వాళ్ళ నాన్న అంటాడు. ఇంతలో రంగారావు వచ్చి రాదా వల్ల నాన్నకి ఇదిగోనండి మీరు ఇచ్చిన 20000 సమయానికి ఇచ్చి నన్ను ఆదుకున్నారు థాంక్స్ అని అంటాడు. మనలో మనకు థాంక్స్ దేనికండి అని మురళీకృష్ణ అంటాడు. అవును మీ చిన్నమ్మాయికి పెళ్లయిందట కదా అల్లుడ్ని అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తావు అని రంగారావు అంటాడు.అల్లుడు సంగతేమో గాని రాదా ని మాత్రం కచ్చితంగా తీసుకొస్తాను అని మురళి అంటాడు.
Madhuranagarilo ఎపిసోడ్ 178: రాధ శ్యామ్ కలిసి స్కూల్ లో దింపినందుకు ఆనందంలో పండు…రుక్మిణి తో శ్యామ్ గతం తెలిసి షాక్ లో రాధ!

ఏంటండీ అలా అంటున్నారు అని రంగారావు అంటాడు. అంటే అల్లుడుగారు పెళ్లి అవగానే ఫారెన్ కి వెళ్ళిపోయారు మా ఇంటికి రాకుండానే వెళ్ళిపోయాడని అలా కోపంగా అన్నాడు అంతే అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే రాదా క్యారేజ్ కట్టడం అయిపోయిందా త్వరగా కట్టేస్తే డ్రైవర్ కి ఇస్తే ఆఫీస్ కెళ్ళి ఇస్తాడు అని మధుర అంటుంది. అత్తయ్య ఆయనకు క్యారేజీ నేనే తీసుకెళ్తాను అని రాధా అంటుంది. నువ్వు గాని గ్యారేజ్ తీసుకెళ్తే అన్నం తినకుండానే మీ ఆయనకి కడుపునుండి పోతుంది తీసుకెళ్ళు అని మధుర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రాదా అమ్మానాన్నలతో బాగానే ఉంటుంది నాతో ఎందుకు ఎడబాటుగా ఉంటుంది నన్ను ఎందుకు క్షమించలేక పోతుంది అని శ్యామ్ ఆలోచిస్తూ ఉంటాడు.కట్ చేస్తే రాదా ఆఫీస్ కి క్యారేజీ తెచ్చి శ్యామ్ ని తినమని వడ్డిస్తుంది. నువ్వు తిన్నావా తినకపోతే ఇద్దరం కలిసి తిందాం రా అని శ్యామ్ అంటాడు నేను తర్వాత తింటాను ముందు మీరు తినండి అని రాదా అంటుంది. ఆకలిగా లేదా నాతో కలిసి తినడం ఇష్టం లేదా అని శ్యామ్ అంటాడు.

పొద్దున పంతులుగారు చెప్పారు కదా మీ మొదటి భార్య గురించి నాకు చెబితే నేను తనతో మాట్లాడి సమస్య రాకుండా చూస్తాను అని రాదా అంటుంది. తాను ఈపాటికి ఎవరివో పెళ్లి చేసుకొని వాడి జీవితాన్ని బలి చేసి హ్యాపీగా ఉండి ఉంటుంది నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచించకు అని శ్యామ్ అంటాడు. అది కాదండి తను తిరిగి వస్తే తన స్థానాన్ని తనకి ఇవ్వడం ధర్మం కదా అని రాధా అంటుంది. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే నేను ప్రాణాలతో ఉండును అయినా తను రాదు పదేపదే దాని గురించే ఎందుకు ఆలోచిస్తావు రాదా నాకు బాగా ఆకలేస్తుంది అని శ్యామ్ అంటాడు. ఆకలి వేస్తే తినండి అని రాధా అంటుంది. ఇద్దరము కలిసే తిందాం లేదంటే నాకు కూడా వద్దు అని శ్యామ్ అంటాడు. సరే ఇద్దరం కలిసి తిందాము అని రాధా శ్యామ్ కలిసి భోజనం చేస్తారు..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది