Brahmamudi అక్టోబర్ 11 ఎపిసోడ్ 224: సీతారామయ్య, ఇందిరా దేవి ఆలోచిస్తూ ఉంటారు కనకం కూడా ఎంత ఖర్చు చెప్పినా కన్విన్స్ అవడం లేదని చిట్టి వాళ్ళ బావతో చెబుతుంది. అప్పుడే తెలిసిన వాళ్ళందరికీ చెప్పారా లేదా అని ఇందిరా దేవి సీతారామయ్యను అడుగుతుంది అడిగాను చిట్టి అని ఆయన సమాధానం చెబుతారు. అంతలోకి గుడిలో నుంచి పంతులుగారు ఫోన్ చేస్తే, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాను అని చెప్పబోతుండగా.. మీ మనవరాలు కావ్య గుడిలో ఉందండి ఎంతగా పిలిచినా పలకడం లేదు మౌనంగా అమ్మవారిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అని సీతారామయ్యతో ఆయన చెబుతాడు. అయితే మా మనవరాలు కావ్య ఎక్కడికి వెళ్ళకుండా మీరు చూడండి. మేము వెంటనే బయలుదేరి వస్తాము అని సీతారామయ్య చెబుతాడు. మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. నేను ఏం చెప్పినా ఆ అమ్మాయి వినే పరిస్థితిలో లేదు అనే పంతులుగారు చెబుతాడు. ఇక వెంటనే సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు గుడికి బయలుదేరుతారు.

వాళ్ళు గుడిలో కావ్య ను చూసి ఎంటామ్మ కావ్య ఇక్కడ కూర్చున్నావ్ ఏంటమ్మా అని అడగగా, రాజ్ రాసిన చిట్టీ ఇస్తుంది కావ్య. అది చదివిన తర్వాత సీతారామయ్య, ఇందిరా దేవి షాక్ కి గురి అవుతారు. మీ మనవడు ఇప్పటివరకు నామీద ప్రేమ చూపించలేదు కేవలం నటిస్తున్నాడని ఆ దేవుడికి నివేదించుకున్న చీటీ మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి తాతయ్య ఇప్పటివరకు ఎన్నో బాధలను అవమానాలను భరించాను. భర్తకి భార్య అన్ని కావాలని అన్నారు. అలాగే భార్య కూడా జీవితం అనుకుంటుంది. అలాంటి ఆయన మనసులో నాకు స్థానం లేనప్పుడు నా బతుకు దుర్భరం తప్ప ఇంకేముంది..

ఇంకా ఆ ఇంటికి ఏ మొహం పెట్టుకొని రావాలి.. నా గోడు ఆ దేవుడికి తప్ప ఇంకెవరికి చెప్పుకోవాలి అని కావ్య అనగానే.. ఏమా మేమిద్దరం నీకు లేమా మీ వల్లే కదా తాతయ్య ఇదంతా జరిగింది. మీరు చెప్పడం వల్లే కదా ఆయన నాతో ప్రేమగా నటించారు అని కావ్య వాపోతోంది. నేను మీ ఇంట్లో ఒక ఇంటి సభ్యురాలిని కాలేకపోతున్నాను అని కావ్య తన మనసులో ఉన్న బాధనంతా సీతారామయ్య ముందు వ్యక్త పరుస్తుంది. ఇంకా అక్కడికి ఏ హక్కుతో రావాలని కావ్య వాళ్ళని నిలదీస్తుంది. భర్త ప్రేమ దక్కలేదని వెళ్ళిపోతే ఎన్నో కాపురాలు రోడ్డు మీద ఉండేది కొన్ని కొన్ని సార్లు మనమే అడ్జస్ట్ అవ్వాలని ఆమె చెబుతుంది అంటే నేను ఎప్పటికీ భర్త ప్రేమ కోసం ఎదురుచూస్తూనే ఉండాలా బామ్మ గారు అని కావ్య అనగానే.. సహనం కావాలని చెబుతున్నానమ్మా అని అంటుంది.

ఇందిరా దేవి రాజ్ గురించి కొన్ని మంచి విషయాలు చెబుతుంది. వాళ్ళ అమ్మ నిన్ను తిడుతున్నప్పుడు తను ఎందుకు ఆపాడు. నీ పుట్టింటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు రాజు ఎందుకు హెల్ప్ చేశాడో ఆలోచించు. ఒక్కొక్కసారి రాజు ప్రేమను ఏదో మాయకు అమ్మేస్తుందమ్మా అని ఆమె చెబుతుంది. కావ్య కి ఎంత ఖర్చు చెప్పినా ఇంటికి రానంటుంది. సరిగ్గా అదే సమయానికి రాజ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఏంటి నానమ్మ మీరు ఎంత చెప్పినా తను ఇంటికి రాను అంటుందా? అసలు నీకు ఏమైంది నిన్నటి నుంచి ఏమైపోయావు అని రాజ్ కాదని కొట్టడానికి చేయేత్తుతాడు కానీ కొట్టకుండా ఆగిపోతాడు. ఎందుకురా ఆగిపోయావు కొట్టు అని వాళ్ళ నాన్నమ్మ అంటుంది.

అసలు నిన్ను ఎవరు ఏమన్నారు. ఎవరు ఏమి అనకుండా ఎందుకు ఉన్నట్టుంది ఇలా మాయమైపోయావని రాజ్ కావ్య ను నిలతీస్తాడు. అవును అని రాజ్ ని వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఏయ్ నిన్నే అడుగుతున్నా చెప్పవెంటి.. చెప్పల్సినవన్ని మీ తాతయ్య, నానమ్మ లకి చెప్పాను అని అంటుంది. నువ్వు మారిపోతే ఒక రోజు రాత్రంతా గుడిలో కటిక నేల మీద పడుకుంటానని మొక్కుకుంది. ఇప్పుడు ఆమెకు తీర్చుకుందిలే ఇంతకీ నువ్వు మారిపోయావా లేదా అని వాళ్ళిద్దరూ అడుగుతారు. కావ్య కూడా రాసిని సూటిగా ప్రశ్నిస్తుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో స్వప్న మెట్లు మీద నుంచి పడిపోతుండగా కావ్య వెళ్లి పట్టుకుంటుంది. ఆ తరువాత కావ్య నడవలేక నడుస్తుంటే తను పడిపోతుండగా రాజు వెళ్లి పట్టుకుంటాడు. ఏమయింది అని అడగగా కాలు బెణికింది అని కావ్య చెబుతుంది. అయితే కావ్య కాలుని తన మీద పెట్టుకొని కాళ్ళకి మసాజ్ చేస్తాడు. రాజు ఆ తర్వాత తన భుజం మీద చేయి వేసుకొని తనని అటు ఇటు నడిపిస్తాడు రాజ్.