Madhuranagarilo November 10 episode 206: శ్యామ్ స్లాప్ పైకి వెళ్లి పండు ని అలా బాధ పెట్టకుండా ఉండాల్సింది నా వల్లే వాడు ఆరోగ్యం పాడయింది ఇంకెప్పుడు నేను అలా ప్రవర్తించకూడదు అని అనుకుంటాడు. ఇంతలో రాదా వంట చేసి ఈయన ఏం చేస్తున్నాడని పైకెక్కి చూస్తుంది. ఏంటండీ ఏదో ఆలోచిస్తున్నారు దేని గురించి అని రాదా అడుగుతుంది.ఏమీ లేదు రాదా మీ గురించి ఆలోచిస్తున్నాను అని శ్యామ్ అంటాడు. నిజంగా మీరు నా గురించి ఆలోచిస్తున్నారా అయితే నాకు ఒక విషయం చెప్పండి మీరు దేని గురించి ఇంతలా బాధపడుతున్నారు అని అంటుంది రాదా. ఏమీ లేదు రాదా ఆఫీస్ లో ఒత్తిడి వల్ల అలా ప్రవర్తించాను అని శ్యామ్ అంటాడు. నమ్మమంటారా నిజంగా మీకు నా మీద నమ్మకం అనేది ఉంటే ఏం చెప్పినా రాదా అర్థం చేసుకుంటుందని మీకు అనిపిస్తే ఏం జరిగిందో నాకు చెప్పండి, మిమ్మల్ని రెండు రోజుల కాడ నుంచి చూస్తున్నాను ఎక్కువగా చిరాకు పడుతూ కోపంగా ఉంటున్నారు దేనికి అని రాదా అడుగుతుంది.

చెప్పాను కదా రాదా అని శ్యామ్ అంటాడు. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి నమ్ముతాను ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది, పునాదుల మీదే ఇల్లు నిలబడ్డట్టు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే నండి భార్యాభర్తల బంధుo నిలబడుతుంది, పునాది సరిగా లేకపోతే ఆ బిల్డింగు కూలిపోతుంది సంసారం కూడా అంతే పునాది అనే నమ్మకం మీద నిలబడి ఉంటుంది అది గుర్తుపెట్టుకుని మీరు ప్రవర్తించండి అని రాధా అంటుంది. అలాగే రాధా నేను అర్థం చేసుకోగలను అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే ఏంటి మమ్మీ మీ ఆయన ఇంకా రెడీ కాలేదా అని పండు అంటాడు. ఆ మాటకి రాదా షాకే ఏంట్రా అలా అంటున్నావు అన్నట్టుగా చూస్తుంది. ఎప్పుడో పొద్దున అనగా రాదా గుడికి వెళ్దామని చెప్పింది రెడీ అవ్వరా అని మీ ఆయనకు చెప్పానమ్మా వాడు ఇంతవరకు రెడీ కాలేదు ఆడపిల్లల గంటలు గంటలు రెడీ అవుతున్నాడు ఏంటి అని మధుర అంటుంది.

ఏంటి మధుర మీ ఆడవాళ్లే గంటలు గంటలు తయారవుతారా మా మగవాళ్ళం కూడా తయారవుతాము అని ధనంజయ్ అంటాడు. నీ మగవాళ్ళు గంటలు గంటలు తయారవ్వడానికి ఏముంటుందండి ఒక పాయింటు చొక్కా తగిలించుకోవడానికి గంట టైం పడుతుందా చెప్పండి అని గట్టిగా బెదిరించినట్టు అంటుంది మధుర.గంట టైం ఏం పట్టదు లే మధుర ఊరికే అన్నాను కానీ మీ ఆడవాళ్లు అలా కాదు కదా, తల దువ్వుకోవాలి మేకప్ వేసుకోవాలి చీర కట్టుకోవాలి పూలు పెట్టుకోవాలి అంటే సమయం పడుతుంది అని ధనంజయ్ అంటాడు. మేము రెడీ అవుతున్నది మీకోసమే బాబు అని మధుర అంటుంది. మా కోసం దేనికి అని ధనంజయ్ అంటాడు. భార్య అందంగా ఉంటే చూసి మురిసిపోతారు కదా అందుకు అని మధుర అంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే రాదా అలా నిలబడి చూస్తుంది. ఏంటి రాధా అలా చూస్తున్నావు అని మధుర అడుగుతుంది. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది అత్తయ్య భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి అని రాదా అంటుంది.

భార్యాభర్తలు అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి అమ్మ అప్పుడే మాలగా ఆనందంగా ఉంటారు అని మధుర అంటుంది. కరెక్ట్ గా చెప్పారు డాడీ అందుకే మీరు ఆనందంగా ఉన్నారు అని శ్యామ్ అంటాడు. నీకు అర్థం చేసుకునే భార్య దొరికింది లేరా అని మధుర అంటుంది. ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను ఆపండి మీ నవ్వులు మీకు మీరు మాట్లాడుకుంటున్నారు నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు అని పండు. ఇవి అర్థం కావడానికి నీకు చాలా టైముంది లేరా నువ్వు ముందు గుడికి వెళ్లి రా అని మధుర అంటుంది. కట్ చేస్తే పండు రాదా గుడికి బయలుదేరుతారు. రుక్మిణి కూడా హైదరాబాదుకి పండును చూడడానికి వస్తుంది. ఒంట్లో బాగోలేదు కాబట్టి పండు స్కూల్ కి రాడు ఇంటికి వెళ్దామంటే నాన్న వద్దన్నాడు, రాదా కి ఫోన్ చేసి ఏదైనా రెస్టారెంట్ కి తీసుకురమ్మంటాను అని రుక్మిణి అనుకుంటుంది. రుక్మిణి రాదా కి ఫోన్ చేసి హలో రాధా నేను హైదరాబాద్ వచ్చాను పండుని తీసుకొని ఏదైనా రెస్టారెంట్ కి రా అని అంటుంది. అక్క పండు ఆరోగ్యం కుదుటపడితే సహస్రనామాలతో అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను మేము గుడికి వెళుతున్నాం అక్క అని రాధా అంటుంది.

అవునా ఏ గుడికి వెళ్తున్నారో చెప్పండి నేను కూడా వస్తాను అని రుక్మిణి అంటుంది. సీతారామాంజనేయ గుడికి వెళ్తున్నాం అక్క నువ్వు అక్కడికే వచ్చేయ్ అని రాదా చెప్తుంది. డ్రైవర్ గుడికి వెళ్లడానికి ఎంత టైం పడుతుంది అని రుక్మిణి అడుగుతుంది. వచ్చేసా మేడం ఇంకో పావుగంటలో గుడి దగ్గరే ఉంటాము అని డ్రైవర్ అంటాడు. కట్ చేస్తే గుడికి వెళ్లి రాదా వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు పంతులుగారు అర్చన చేస్తూ ఉంటారు. పూజ అయిపోయాక తీర్థప్రసాదాలు తీసుకొని రాధా చెట్టువంక చూస్తుంది. అక్కడ ఏం చేస్తున్నారు పంతులుగారు అని రాదా అడుగుతుంది.

ఈరోజు శనివారం కదా అమ్మ ముక్కులు మొక్కుకొని ముడుపులు కడతారు అని పంతులుగారు చెప్తాడు. నేను కూడా మా బావగారు అడ్రస్ తొందరగా తెలవాలని ముడుపు కడతాను శ్యామ్ సార్ అని అంటుంది రాదా. మీ అక్క ఎలాగూ వస్తుంది కదా రాధా ఆవిడని అడిగితే తెలుస్తుంది కదా అని శ్యామ్ అంటాడు. మా అక్కను అడిగితే నీకు అతని వివరాలు ఎందుకు నేను చూసుకుంటాను లే అని అంటుందండి అని రాదా అంటుంది. పంతులుగారు చెట్టు దగ్గరికి తీసుకువెళ్లి రాదా చేత ముడుపు కట్టిస్తాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది