NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Niharika Konidela: ఇండ‌స్ట్రీలో నిహారిక ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు?!

Niharika Konidela: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని కెరీర్ పైనే పెట్టింది. పెళ్లయిన రెండేళ్లకే చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకున్న నిహారిక.. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అలాగే సొంతంగా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. ఇప్ప‌టికే నాన్న కూచి, మ్యాడ్‌ హౌజ్‌, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్, డెడ్‌ పిక్సెల్స్ వంటి వెబ్ సిరీస్‌ల‌ను ప్రొడ్యూస్ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక ఇండ‌స్ట్రీలో తన ఫస్ట్ రెమ్యునరేషన్ గురించి ఓపెన్ అయింది. మెగా ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమకు పరిచయమైన ఏకైక హీరోయిన్ నిహారిక. స్టడీస్ పూర్తయిన తర్వాత ఈ బ్యూటీ యాంకర్ గా బుల్లితెరపై అడుగు పెట్టింది. ప్రముఖ రియాలిటీ షో ఢీ జూనియర్స్‌ షో ద్వారా 2015లో తన కెరీర్ ప్రారంభించింది. తనదైన మాట తీరుతో అందరినీ మెప్పించింది.

అయితే ఈ షోకు గాను నిహారిక తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు. ఢీ జూనియర్స్ షోకు నిహారిక తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ రూ. 20 వేలు. ఒక్కో ఎపిసోడ్ కి నిహారిక రూ. 20,000 తీసుకునేదట. అప్పట్లో తాను పెద్దగా డిమాండ్ చేయలేదని.. ఇచ్చినంత తీసుకున్నానని నిహారిక తెలిపింది. అలాగే ఢీ జూనియర్స్‌ షో ద్వారా సంపాదించిన డబ్బును సొంత ఖర్చులకు కాకుండా తండ్రి నాగబాబుకు ఇచ్చేదాన్న‌ని.. ఆయన ఆ డబ్బును త‌న‌ పేరిటే సేవ్ చేసేవార‌ని నిహారిక చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా త‌న ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తో అమ్మా నాన్నలకు గిఫ్ట్స్ ఇచ్చాన‌ని.. నాన్న నాగ‌బాబుకు హెడ్‌ ఫోన్ మ‌రియు త‌ల్లి ప‌ద్మ‌జాకు గోల్డ్ ముక్కుపుడక కానుక‌గా ఇచ్చాన‌ని, అవి చూసి వారెంతో సంతోషించార‌ని నిహారిక పేర్కొంది. కాగా, ప్రస్తుతం నిహారిక మద్రాస్కరన్ అనే ఓ త‌మిళ చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో ఆర్‌డీఎక్స్ ఫేమ్ షేన్ నిగ‌మ్ హీరోగా న‌టిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ లో వాట్ ది ఫిష్ పేరుతో ఓ మూవీ చేస్తోంది. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు చిత్రీక‌ర‌ణ ద‌శలో ఉంది.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri