Nindu Noorella Saavasam December 16 2023 Episode 109: నాకెందుకు ఇంత సంతోషం కలుగుతుందో నాకే అర్థం కావట్లేదు పొద్దున అంజలికి బాగోలేనప్పుడు కూడా నాకు చాలా బాధ కలిగింది మా నాన్నకి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా నేను ఇంత బాధ పడతాను ఆ బాధ ఇప్పుడు అంజలికి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా అదే బాధను అనుభవించాను అసలు ఇలా ఎందుకు జరుగుతుంది నాకు అంజలికి ఏంటి సంబంధం అని భాగమతి. అది రక్తసంబంధం లో ఉన్న అనుభవం అలాగే ఉంటుందమ్మా అని గుప్తా అనుఅంటాడు. అంజలి పాస్ అయినందుకు నాకే ఇంత ఆనందంగా ఉంటే వాళ్ళ అమ్మ బ్రతికి ఉంటే ఇంకెంత సంతోషించేదో అని భాగమతి అంటుంది. అది తన మొహంలో కనపడుతుంది కదా అని గుప్తా అంటాడు. ఏంటి గుప్తా గారు అంజలి పాస్ అయితే అక్క మొహం లో ఆనందం ఎందుకు కనపడుతుంది అని భాగమతి అడుగుతుంది. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా అలా బిగుసుకుపోతారు.
ఏంటి ఏమి మాట్లాడరు చెప్పండి గుప్తా గారు అని భాగమతి అంటుంది. అంటే అంజలి వాళ్ళ అమ్మ నా ఫ్రెండ్ కదా అందుకని నాకు సంతోషం వేసింది అని గుప్తా గారు చెప్తున్నారు దగ్గరికి వచ్చి చెప్పండి గుప్తా గారు అని అరుంధతి అంటుంది. అంతే బాలిక అని గుప్తా అంటాడు. మిస్సమ్మ అంజలి పాస్ అయినందుకు నీకు అంత సంతోషం వేసిందా అని అరుంధతి అంటుంది. అవునక్కా అని భాగమతి అంటుంది. అయితే ఆనందంలో స్వీట్ చేసి తిని పడుకో అని అరుంధతి అంటుంది. నువ్వన్నట్టు అలాగే పడుకునే దాన్ని ఒక చిన్న పని మిగిలిపోయింది అది చేసిన తరువాత ప్రశాంతంగా నిద్రపోతాను అని అంటుంది భాగమతి. ఏంటి మిస్సమ్మ ఆ పని నాకు చెప్పకూడదా అని అరుంధతి అంటుంది. అదే అక్క మా నాన్నకి హెల్త్ విషయంలో సార్ సంతకం కావాలి ఆ సంతకం పెట్టిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని భాగమతి అంటుంది. ఆయన సంతకం పెడితే ఇకనుంచి వెళ్ళిపోతావా అని అరుంధతి అడుగుతుంది.
ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పలేక వెళ్ళిపోతుంది బాగమతి. ఏంటి గుప్తా గారు మిస్సమ్మ ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది మీకు తెలిసే ఉంటుంది కదా చెప్పండి అని అంటుంది అరుంధతి. ఆ బాలిక ఎందులకు అలా వెళ్ళినదో నాకు ఏమీ తెలియదు ఇందాక మనిద్దరం మాట్లాడుకుంటునది నీలా చూసింది దానిని ఎలా సమర్ధించుకోవాలో అర్థం కావట్లేదు అని గుప్తా అంటాడు. నీలా నీ పార్టీ నే కదా తను ఎవరికీ చెప్పదులే అని అరుంధతి అంటుంది. ఆ మాట అనగానే గుప్తా గారు సిగ్గు పడిపోతారు. సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అని అరుంధతి అంటుంది. నువ్వు చచ్చాకే ఇక్కడున్నవ్ బాలిక అని గుప్తా అంటాడు. అవును కాదు అంటూ వెళ్ళిపోతుంది అరుంధతి. కట్ చేస్తే, ఆ డ్రైవర్ గాడు పది లక్షలు ఇవ్వమని బెదిరిస్తున్నాడు ఏం చేయాలి అని మనోహరి టెన్షన్ పడుతుంది. ఇంతలో నీలా గబగబా వచ్చి మనోహరి ని గుద్దేస్తుంది. కళ్ళు కనిపించట్లేదా చూసుకొన్నాడవే అని మనుహరి అంటుంది. అమ్మగారు మన ఇంట్లో తోటమాలి ఎవరితో మాట్లాడుతుంటే నేను చూశాను కానీ అక్కడ ఎవరు కనిపించలేదమ్మా అని నీలా అంటుంది. అయితే ఇంట్లో ఏదో జరుగుతుందే నిన్ను ఘోరాని కలవమని చెప్పాను కలిసావా అని అంటుంది మనోహరి.
లేదమ్మా గారు అతను కన్నెపిల్లల్ని పట్టుకెళ్తాడంట అందుకే భయం వేసి వెళ్లలేదు అని నీలా అంటుంది. నేను డబ్బులు ఇస్తున్నది నేను చెప్పిన పని చేయడానికి ఇలా అబద్ధాలు చెప్పడానికి కాదు ఇప్పుడైనా వెళ్లి అతని గురించి ఎంక్వయిరీ చెయ్ అని మనోహరి అంటుంది. అలాగే అమ్మగారు అని నీలా అంటుంది. కట్ చేస్తే, భాగమతి టాబ్లెట్లు నీళ్లు తీసుకొని అంజలి దగ్గరికి వెళుతుంది. భాగమతిని చూడగానే అంజలి పడుకోబెట్టి లేచి నిలబడతాడు. అంజలికి టాబ్లెట్ ఇస్తుంది భాగమతి. మిస్సమ్మ టాబ్లెట్లు వేసుకోవడం నాకు ఇష్టం లేదు చేదుగా ఉంటుంది అని అంజలి అంటుంది. అయితే నువ్వు ఒక్క నిమిషం కళ్ళు మూసుకో అని భాగమతి అంటుంది. అంజలి కళ్ళు మూసుకోగానే అరటిపండు తీసి దాంట్లో టాబ్లెట్ పెట్టి అంజలికి నోట్లో పెట్టి నీళ్లు పోస్తుంది. ఇప్పుడు టాబ్లెట్ చేదుగా లేదు కదా అంజలి ఇక నువ్వు పడుకో జ్వరం తగ్గిపోతుంది అని భాగమతి అంటుంది.అంజలి ఇక నువ్వు రెస్ట్ తీసుకో రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళాలి కదా అని అమరేంద్ర అంటాడు.మిస్సమ్మ అంజలికి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకో అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మిస్సమ్మ చేసే పనులు అచ్చం మన అరుంధతిలాగే అనిపిస్తున్నాయి కదా అండి అని నిర్మల అంటుంది. అవును మిస్సమ్మ కి అరుంధతికి దగ్గర పోలికలు ఉన్నాయి మిస్సమ్మ మన కోడలు చూసుకున్నట్టే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఏమంటావ్ రా అమర్ అని శివరామ్ అంటాడు.
మీరందరూ చూసి తనని సెలెక్ట్ చేశారంటే మంచి అమ్మాయి అయి ఉంటుంది అని అమరేంద్ర అంటాడు. అది కాదురా ఇంటర్వ్యూలో ఎవరైనా కొషన్లకి ఆన్సర్ చెప్తారు కానీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో చూడు అని శివరామ్ అంటాడు. సారు ప్రత్యక్షంగా ఎవరు నీ పొగడరు కాదా సార్ మీకు తెలుసు కదా అని రాథోడ్ అంటాడు. అమరేంద్ర తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. రాథోడ్ ఆ అమ్మాయికి మంచి గిఫ్ట్ ఇయ్యాలయ్యా అని నిర్మల అంటుంది. అందరూ మిస్సమ్మ మీద మంచిగా ఆలోచిస్తున్నారు ఇదే మంచి సమయం మిస్సమకి సార్ చేత సంతకం పెట్టించుకోమని సారుని అడగమని చెప్పాలి అని రాథోడ్ అనుకుంటాడు.
కట్ చేస్తే, ఘోర వాళ్ళ గురువుగారు దగ్గరికి వెళ్లే ప్రణామములు చేస్తాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చావు అంటే నీకు తెలియని ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వచ్చావని నాకు అర్థమైంది అని వాళ్ల గురువుగారు అంటాడు. పెదనాన్న చిన్నప్పటినుంచి నిన్ను చూస్తూ పెరిగాను మంత్ర తంత్ర విద్యలని నేర్చుకున్నాను కానీ ఇప్పటివరకు ఎక్కడా చూడని వినని ఒక వింతను నేను చూశాను ఒక ఆత్మ మనిషితో ఎలా మాట్లాడుతుంది ఎలా కనపడుతుంది అని ఘోర అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!