Nindu Noorella Saavasam October 3 ఎపిసోడ్ 44: అమ్మ అమ్మ ఎక్కడున్నావు అని ఆకాష్ ఏడుస్తాడు. బాలిక ఏమైనది వెళ్లి చెప్పు అని గుప్తా గారు అంటాడు. అరుంధతి దేవుడా దేవుడా ఆ అమ్మాయి భయపడకుండా చూడు అని అరుంధతి భాగమతిని పిలుస్తుంది. ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు వెళ్లి పోలేదా అని భాగమతి అంటుంది. అంటే కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్లడం ఆనవాయితీ కదా అని అరుంధతి అంటుంది. ఓ అవునా అయితే కార్యక్రమం అయిపోవచ్చినట్టుంది వెళ్లి పక్కన నిలబడండి అని భాగమతి అంటుంది.అంటే నేను మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను ఇలా ఎందుకు అవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు అని అరుంధతి అంటుంది. ఏం అర్థం కావట్లేదు అని భాగమతి అంటుంది.

అదే నేను మీకు కనిపించడం నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అర్థం కావట్లేదు అని అరుంధతి అంటుంది.ఇప్పుడు కాదండి మనం తర్వాత ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం మా నాన్నకు ఏమవుతుందో అనే భయం నాకు మొదలయ్యింది అని భాగమతి అంటుంది.ఇదేంటి గుప్తా గారు నేను మాట్లాడేదానికి ఈ అమ్మాయి మాట్లాడేదానికి ఏమి పొంతన లేదు అంటే ఈ అమ్మాయి న ఫోటో చూడలేదేమో అని అరుంధతి అంటుంది. అంతే అయి ఉంటుంది నువ్వు ఎలాగో మేనేజ్ చెయ్ తొందరపడి నోరు జారకు అని గుప్తా అంటాడు. ఏంటండీ నేను ఇక్కడ ఉంటే మీరు ఎక్కడో మాట్లాడుతున్నారు అని భాగమతి అంటుంది.

మీరు ఏదో బాధపడే కార్యక్రమం పెట్టుకున్నట్టున్నారు మీరు బాధపడండి నేను వెళ్తాను అని అరుంధతి అంటుంది. ఒక్క నిమిషం అని భాగమతి అంటుంది. ఏంటి మళ్లీ ఎందుకు పిలిచావు అని అరుంధతి అంటుంది. ఏమీ లేదు ఇందాక ఏదో మనం కలవడం విషయం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పండి అని భాగమతి అంటుంది. ఏమీ లేదండి మనం కలిసినప్పుడల్లా మన ఇద్దరి మధ్య ఏదో బాండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే అలా అన్నాను అని అరుంధతి అంటుంది. అవునండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని భాగమతి అంటుంది. అయితే నువ్వు ఇందాక ఆ అమ్మాయి ఫోటో చూడలేదా అని అరుంధతి అంటుంది.

చూడలేదండి చూద్దామని అనుకునే లోపు మా పిన్ని ఫోన్ చేసి మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు ఆయని నా నెత్తి మీద పెట్టి నువ్వు వెళ్ళిపోయావు అని నన్ను తిడుతూ ఉండగా నేను ఆవిడ ఫోటో చూడలేకపోయానుమా నాన్నకు ఏమన్నా అయితే నేను అనాధనైపోతాను కానీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా బాధేస్తుంది అందుకే వచ్చి దూరంగా కూర్చొని ఉన్నాను అని భాగమతి అంటుంది. అయ్యో నీ బాధలో నువ్వుంటే నేను వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసాను సారీ అని అరుంధతి వెళ్ళిపోతుంది. మిస్టర్ గుప్తా గారు భాగమతి నన్ను చూడలేదట అని అరుంధతి అంటుంది. ఈరోజు చూడకపోతే రేపు చూస్తుంది బాలిక అని గుప్తా అంటాడు. అవును కదా మరి ఇప్పుడు ఎలా అని అరుంధతి అంటుంది. ఈరోజుతో నీ దశకర్మ అయిపోగానే మలోకానికి వెళ్ళిపోతాము ఈరోజు తో నీకు వాళ్లకున్న అనుబంధం తెగిపోతుంది వెళ్లుము వారితో చివరి క్షణాలు గడుపుమ బాలిక అని గుప్తా అంటాడు.భాగమతి ఏమో వాళ్ళ నాన్నను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది.

ఇక్కడ వీళ్లేమో అరుంధతిని తలుచుకొని బాధపడతారు. అది చూసి అరుంధతి తట్టుకోలేక ఎందుకు భగవంతుడా నా కుటుంబానికి ఈ శిక్ష ఏం పాపం చేశానని మా అత్త మామలకి ఈ వయసులో ఈ కష్టాన్ని ఇచ్చావు ఏం పాపం చేశానని ఈ ప్రేమకు నన్ను దూరం చేసావు ఏం పాపం చేశానని నా భర్తకి ఇంతటి బాధని మిగిల్చావు ఇప్పటి నుంచే నా పిల్లలు తల్లి లేని వాళ్ళ లాగా పెరగాలా ఏం పాపం చేశాను అని అరుంధతి ఏడుస్తుంది. ఇది నీ తప్పిదము కాదు బాలిక నీ స్నేహితురాలి అసూయవలన నీకు నీ కుటుంబానికి ఇంత ఖేదం కలుగుతుంది నీ సంతోషాన్ని తను పంచుకోవాలని ఇలా చేసింది ఇంతమంది దుఃఖానికి కారణం అయ్యింది అని గుప్తా తన మనసులో అనుకుంటాడు.అయ్యా ఈ పిండాలను తీసుకుని నదిలో కలపండి అని పూజారి అంటాడు. పిండాలని తీసుకొని అమరేంద్ర కొడుకులతో పాటు నదిలోకి వెళ్లి ఆ పిండాలని వదిలేసి దండం పెట్టుకొని బయటికి వచ్చి కొడుకులను పట్టుకుని ఏడుస్తాడు పక్కనే ఉన్న అమృత అంజు వచ్చి డాడీ అని పట్టుకొని ఏడుస్తారు.

అమ్మ అరుంధతి నాకు కూతురు లేని లోటు తీరుస్తావు అనుకుంటే ఎవరు తీర్చలేని బాధని మిగిల్చిపోయావా అని వాళ్ళ మామయ్య ఏడుస్తాడు. నీ జీవితాన్ని నాకు ఇచ్చి వెళ్లినందుకు చాలా థాంక్స్ ఆరు ఏ లోకంలో ఉన్న నువ్వు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను ఇక్కడ అమరేంద్రకు ఏ లోటు రాకుండా నేను హ్యాపీగా చూసుకుంటాను అని మనోహరి తన మనసులో అనుకుంటుంది. బాబు ఇక్కడికి కార్యక్రమం అయిపోయింది ఈ అస్తికలు కాశీకి వెళ్లి గంగలో కలిపితే తనకు ముక్తి కలుగుతుంది అని పూజారి అంటాడు. తనే పోయాక కాశీలో కలిపితే ఏంటి కన్యాకుమారిలో కలిపితే ఏంటి మీ పిచ్చి గాని పంతులుగారు అని మనోహరి తన మనసులో అనుకుంటుంది.

ఏంటి మిస్సమ్మ కార్యక్రమం అక్కడ జరుగుతుంటే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు అని రాథోడ్ అంటాడు. ఏమీ లేదండి మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు అని భాగమతి అంటుంది. మిస్సమ్మ అవన్నీ ఎప్పుడూ ఉండే బాధలే కదా సార్ నీ కలవాలని అంటున్నావు ఇప్పుడు ఫోటో కూడా తెచ్చావు సార్ కి నీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది రా కలిసి మాట్లాడుదువు గాని అని రాథోడ్ భాగమతిని తీసుకొని వెళ్తాడు. బాలిక అటు చూడు ఆ రాథోడ్ ఆ అమ్మాయిని తీసుకొని ఇటువైపే వస్తున్నాడు అని గుప్త అంటాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం గుప్తా గారు అని అరుంధతి కంగారు పడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది