NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: కృష్ణాష్టమి పూజ అంతరాయం.? విక్కీని కాపాడిన పద్మావతి.. కృష్ణ ప్లాన్ రివర్స్?

Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి ఇంట్లో అందరి దగ్గర డబ్బులు తీసుకొని అనాధాశ్రమంలో ఇవ్వాలి అని చెప్తుంది ఆ మాటకి అరవిందా ఇంట్లో వాళ్ళు చాలా సంతోషిస్తారు. అరవింద కోసం పద్మావతి చేసిన మంచి పనికి అరవిందా తిరిగి కృష్ణాష్టమి రోజు పద్మావతి విక్కి లను పూజ చేయమని చెప్తుంది. పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights
Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights

ఈరోజు 421 వ ఎపిసోడ్ లో పద్మావతి పిల్లలతో ఆడుకుంటూ, పొరపాటున కుచులకి పూలదండ తగిలేలా చేస్తుంది. వెంటనే కుచల పద్మావతి మీద కోపంతో అరుస్తుంది.ఏంటే మనిషిని చూసుకునే పని లేదా అని అంటుంది. ఇంతకీ మీ అక్క ఎక్కడ, నీతో పాటు తను కూడా ఆడుకుంటుందా, ఇంట్లో పని ఏమైనా చేస్తుందా అని అంటుంది పద్మావతి మనసులో నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను మీ పని అని అనుకుంటుంది. ఏం మాట్లాడవేంటి నోరు మూసుకొని లోపలికి వెళ్లి పని చూసుకో అని అంటుంది.

Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights
Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights

కృష్ణ ప్లాన్ అమలు..

కృష్ణ హాల్లో ఎవరూ లేని టైంలో పూజ కోసం ఏర్పాటుచేసిన పూలల్లో, తను ఒక డబ్బాలో పెట్టి తెచ్చుకున్న తేలుని ఎవరూ చూడకుండా ఆ పూలల్లో వదిలేస్తాడు. ఇప్పుడు ఎలా మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు చూస్తాను అని అంటాడు. అరవింద నువ్వు పద్మావతి వికీలను కలపడానికి పూజ చేయించాలి అనుకున్నావు కదా ఇప్పుడు వాళ్ళు ఎలా కలిసి పూజ చేస్తారో చూస్తాను అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి అందరూ వస్తారు. అరవింద పూలల్లో తేలిన వేయడం చూసిందేమో అని భయపడతాడు కృష్ణ కానీ అరవింద చూడదు. ఏంటండీ మీరు ఎక్కడున్నారు అని అంటుంది అరవింద ఏం లేదు పనులన్నీ అయ్యాయో లేదో చూస్తున్నాను అని అంటాడు. శాంతాదేవి నారాయణ ఇంకా పంతులుగారు రాలేదేంటి అని అంటుంది అదే టైంకి పంతులుగారు కూడా వస్తారు.విక్కీ పద్మావతుల చేత పూజ చేయించడం అవసరమా అని కుచల అడుగుతుంది. అరవింద అవసరమే పిన్ని వాళ్ళ మధ్య ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది అందుకనే వాటన్నిటిని తొలగిపోవడానికి ఈ పూజ చేయిస్తున్నాను అని అంటుంది. అప్పుడే అక్కడికి విక్కీ పద్మావతి అను ఆర్యలు వస్తారు.

Nuvvu Nenu Prema: అరవింద కోసం పద్మావతి పూజలు.. పూజలో పద్మావతికి అపాయం తలపెట్టిన కృష్ణ..

Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights
Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights

విక్కీ పద్మావతి ల చేత పూజ..

పంతులుగారు అమ్మాయి ఇప్పటికే ఆలస్యమైంది పూజ చేసే దంపతులు ఎవరో వచ్చి పీటల మీద కూర్చోండి అని అంటారు. విక్కీ పద్మావతి ఇద్దరు వచ్చి కూర్చుంటారు. పంతులుగారు ఈ పూజ చాలా నిష్ఠతో కూడుకున్నది ఇప్పుడు మీరు ఈ పూజని మధ్యలో ఆపకూడదు ఎన్ని అవాంతరాలు వచ్చినా పూజ పూర్తవ్వాలి లేదంటే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది అని అంటారు. అరవింద అలా ఏం జరగదు లేండి పూజ ఎక్కడ ఆగదు అని అంటుంది. కృష్ణ మాత్రం ఎలా ఆగదు నేను చూస్తాను అని మనసులో అనుకుంటాడు. విక్కీ మా అక్క కోసం నేను ఏదైనా చేస్తాను అని మనసులో అనుకోని పద్మావతి తో పాటు పూజ చేయడానికి కూర్చుంటాడు. పంతులుగారు ఇద్దరికీ కంకణాలు కట్టుకోమని చెబుతారు ఒకరికి ఒకరు కంకణం కట్టుకుంటారు ఆ తర్వాత ఇద్దరు కలిసి అభిషేకం చేయండి కృష్ణుడికి అని అంటాడు. విక్కీ ఒక్కడే అభిషేకం చేస్తుంటే ఇద్దరూ కలిసి చేయండి లేదంటే మీ ఇద్దరి దాంపత్యం సవ్యంగా ఉండదు అని అంటారు సరే అని ఇద్దరు కలిసి అభిషేకం చేస్తారు అరవింద చాలా సంతోషిస్తుంది ఇక వీళ్ళ మధ్య ఏ గొడవలు రావు అని అనుకుంటుంది. ఇక పద్మావతి వికీ ఇద్దరి చేత పూలతో పూజ చేయమని చెప్తాడు. కృష్ణ ఇప్పుడే అనుకున్నది జరుగుతుంది అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ పూలల్లోనే తేలు ఉంటుంది కాబట్టి పద్మావతిని విక్కిని ఎవరో ఒకరిని ఆ తేలు కుడుతుంది అని అనుకుంటాడు. పద్మావతి వికీ ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు పూలు తీసుకొని ఒక్కొక్కటి వేస్తూ ఉంటారు. కొన్ని పూలు అయిపోగానే లోపల తేలు కనపడుతుంది పద్మావతికి, అప్పుడే విక్కీ చేయి పెట్టబోతు ఉంటాడు, పద్మావతి చూసి విక్కి చేతిని తోసేసి తన చేతిని పెడుతుంది తనకి తేలు కుడుతుంది. అప్పుడే నారాయణ కూడా తేలి చూసి పద్మావతి తేలు అని అరుస్తాడు పద్మావతికి అప్పటికే తేలుతుంది. నారాయణ వెంటనే ఆ తేలు తీసి పక్కన పడేయండి అని అంటాడు విక్కీ తేలు తీసి బయట పడేస్తాడు. మొత్తానికి కృష్ణ అనుకున్నది అయితే జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు మనసులో

Krishna Mukunda Murari: దగ్గరైన కృష్ణ మురారిని చూసిన ముకుంద అందరి ముందు ఏం చేసిందంటే.!?

Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights
Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights

పద్మావత కి తప్పిన అపాయం..

పద్మావతికి తేలు కొట్టడంతో చాలా నొప్పిగా అరుస్తూ ఉంటుంది నారాయణ పద్మావతి చేయి అడ్డం పెట్టకపోయి ఉన్నట్టయితే ఆ తేలు విక్కి కుట్టేది అని అంటాడు.విక్కీ ఒకసారిగా పద్మావతి చూసి పద్మావతి ఏమైంది ఏమైంది అని అరుస్తూ ఉంటాడు.త్వరగా పసుపు పెట్టు అని అంటుంది శాంతాదేవి విక్కీ పసుపు పెడతాడు. వెంటనే హాస్పిటల్ కి వెళ్దాం అని అంటుంది. విక్కీ నువ్వేం టెన్షన్ పడమాకు పద్మావతి నీకేం కాదు నేనున్నాను అని అంటాడు. పద్మావతికి తేలు కుట్టిచోట విక్కి నోటి తో ఆ విషమ్ అంత తీసి పక్కకి పడేస్తూ ఉంటాడు. ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ముందు మంచినీళ్లు తాగించండి అంటాడు నారాయణ విక్కీ మంచినీళ్లు తీసుకురమ్మని అని కి చెప్తాడు అను మంచినీళ్లు తీసుకువచ్చే లోపు పద్మావతికి ఏమన్నా అవుతుందేమోనని కొబ్బరికాయని కొట్టి ఆ నీళ్ళని పద్మావతి నోట్లో పోస్తాడు. పద్మావతి ఏమీ కాదు స్లోగా నీళ్లు తాగు నువ్వు లేస్తావు ఏం కాదు నీకు అని ధైర్యం చెబుతూ ఉంటాడు. పద్మావతికళ్ళు తెరిచి చూస్తుంది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ లోపు కృష్ణ మనసులో చా నేను అనుకున్నది ఒక్కటి జరిగిందొకటి వీళ్లిద్దరిని విడగొడదామని నేను ఇంత ప్లాన్ వేస్తే అదంతా అప్సెట్ అయింది అని బాధపడుతూ ఉంటాడు. కుచల హాస్పిటల్ కి తీసుకు వెళ్దాం లేదంటే మన మీదకు వస్తుంది విక్కీ అని అంటుంది. వెంటనే పద్మావతి పూజ ఆగడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ జరగాల్సిందే అని అంటుంది. పద్మావతి నీకు పిచ్చి గాని పట్టిందా ఇలాగంటి పరిస్థితుల్లో అవసరమా ఇప్పుడు పూజ పద హాస్పిటల్ కి వెళ్దాం అని అంటాడు. లేదు ఈ పూజ ఎలాగైనా సరే జరగాల్సిందే అని అంటుంది నారాయణ సరే దేవుడి దయ వల్ల పద్మావతి బానే ఉంది కదా ముందు పూజ జరిపించండి అని అంటాడు.పంతులుగారు పూజ పూర్తయిందమ్మ ఇంక మీరు ప్రదక్షిణాలు చేస్తే అయిపోతుంది అని అంటాడు. పద్మావతి వికీ ఇద్దరు పూజ కంప్లీట్ చేస్తారు. ఇద్దరూ కలిసి తులసిమాల ని వేసుకోండి అని అంటారు పంతులుగారు. విక్కీ పద్మావతి ఇద్దరూ కలిసి తులసి మాల వేసుకుంటారు. మీరిద్దరూ వేరువేరు కాదు ఒకటే అని చెప్పడానికే ఈ తులసి మాల వేసుకోమన్నది అని అంటారు. నీ ప్రాణాలు బలంగా పెట్టి మీ ఆయన ప్రాణం కాపాడే అమ్మ మీ దాంపత్యం ఎప్పటికీ సుఖంగా ఉంటుంది అని పంతులుగారు దీవిస్తారు. ఇక పద్మావతి వ్యక్తి ఇద్దరు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవలేదు అయినా నేను వదలను విడదీసి తీరుతాను అని మనసులో అనుకుంటాడు కృష్ణ.

Brahmamudi సెప్టెంబర్ 20 ఎపిసోడ్ 205: అపర్ణ వలలో చిక్కిన కావ్య.. రుద్రాణి డెవిల్ ప్లాన్ కావ్య కుటుంబానికి అన్యాయం..

Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights
Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights
ఉట్టి కొట్టే ఆట..

నారాయణ ఉట్టి కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు అప్పుడే కుచల వచ్చి నారాయణ ఈ పొట్ట,నువ్వేంటి,అసలు నువ్వు పుట్టి ఎలా కొడదాం అనుకుంటున్నావు అని అంటుంది. వెంటనే పద్మావతి ఉట్టి కొట్టడానికి వయసుతో ఏముందిఅది ఒక సరదా అయినా ఆట అంతే ఎవరైనా కొట్టొచ్చు అని అంటుంది కరెక్టుగా చెప్పావమ్మా అని అంటాడు నారాయణ.అరవింద ఏంటి విక్కీ ఎక్కడ కనిపించట్లేదు అని అంటుంది.లోపలే ఉన్నాడు అక్క అని అంటాడు ఆర్య. శాంతాదేవి లోపల ఉంటే ఎలా రమ్మని చెప్పు ఉట్టి కొట్టడానికి అని అంటుంది నేను ఎంత చెప్పినా రావట్లేదు నానమ్మ అని అంటాడు ఆర్య. నారాయణ అరవిందను వెళ్లి పిలవమ్మా వాడే వస్తాడు అని అంటాడు లేదు బాబాయ్ ఇప్పుడు నేను కాదు పిలవాల్సింది పద్మావతి పిలిస్తే వస్తాడు అని అంటుంది అరవింద. పద్మావతి నేనానేను పిలిస్తే వస్తాడంటారా అని అంటుంది. ఎందుకు ఇప్పుడు తనని పంపించి విక్కీ మూడు పాడు చేస్తారు అని అంటుంది కుచల. నువ్వు కాస్త ఆపుతావా అంటాడు నారాయణ పద్మావతి వెళ్లి విక్కీని పిలుస్తుంది కృష్ణాష్టమికి ఉట్టి కొట్టడానికి కిందకి రండి అని అంటుంది. నేను రాను అని అంటాడు అలాంటివి నాకు ఇంట్రెస్ట్ ఉండవు అని అంటాడు విక్కి. ఆడకుండా ఇంట్రెస్ట్ లేదంటే ఎలాగూ, ఒకసారి అడితేనే కదా అని అంటుంది పద్మావతి. నాకు ఇంట్రెస్ట్ లేదు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా అంటాడు విక్కీ. ఈ టెంపర్ వాడికి సరిగ్గా చెప్తే ఏది ఎక్కదు రివర్స్లో చెప్పాలి అని, నిజంగానే ఇంట్రెస్ట్ లేదా లేదంటే అని ఆపేసి సరే నేను వెళ్తున్నాను అని అంటుంది. ఏయ్ ఆగు ఏంటి ఏం అర్థమైంది నీకు, నా నోటితో నేను ఎందుకు చెప్పడం నాకు మీరు ఎందుకు రావట్లేదు అర్థమైందిలే అని అంటుంది. నువ్వు ఇప్పుడు ఎందుకు అలా అన్నావో నాకు తెలియాలి. ఏంటి తమాషాగా ఉందా నీకు? నీ పాటికి నువ్వు వచ్చినన్ను రమ్మని చెప్పి మళ్ళీ వద్దులే నేను వెళ్తున్నాలే అని ఎందుకు ఇవన్నీ ఏంటో మనసులో ఉన్న చెప్పు అని అంటాడు. ఉట్టి కట్టడానికి మీరు నాతో తలపడలేరు కదా, అందుకనే రాను అంటున్నారు కదా ఆ విషయం మీతో చెప్తే మళ్ళీ మీరు కోప్పడతారని, మీతో ఇప్పుడు దాకా చెప్పలేదు ఫైనల్ గా మీరు నా చేతిలో ఓడిపోతారనే కదా మీరు తెలివిగా కవర్ చేసుకొని ఇంట్రెస్ట్ లేదన్నమాట చెప్తున్నారు. పద్మావతి తో పెట్టుకుంటే ఓడిపోవడం ఎందుకని మీకు మీరే డ్రాప్ అవుతున్నారు అది మీకు మంచిదే కానివ్వండిఇలాగైనా నేను గొప్పదాన్ని ఒప్పుకున్నారు అని అంటుంది.ఏంటి నేను రానని చెప్పిన ఒక మాటకి నీ అంతటి నువ్వే గ్రేట్ గా ఫీల్ అవుతున్నావా నీకు అంత సీన్ లేదు,ఈ విక్రమాదిత్య లైఫ్ లో ఓటమి అనే పదానికే ప్లేస్ లేదు. అని అంటాడు విక్కీ గదిలో చెప్పడం కాదండి నలుగురిలోకి వచ్చి బరిలో దిగి చెప్పండి అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights
Nuvvu Nenu Prema today episode 21 september 2023 episode 421 highlights

 

రేపటి ఎపిసోడ్ లో,పద్మావతి విక్కీ తో నాతో తలపడడం అంత ఈజీ కాదు అని అంటుంది. ముందు నువ్వు ఉట్టి కొట్టి చూపించు అని అంటాడు విక్కీ. కృష్ణ వచ్చి విక్కీతో, మీ ఇద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉంటే పద్మావతి గెలుస్తుంది అని అంటాడు. వెంటనే విక్కీ పద్మావతిని ఎత్తుకొని తన చేత ఉట్టి కొట్టించి గెలిపిస్తాడు. పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Related posts

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri