NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema February 10 2024 Episode 543: అన్నదమ్ముల్ని ఒకటి చేసిన పద్మావతి..నారాయణ సంతోషం..అరవింద, విక్కీ ల కోపం..

Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights

Nuvvu Nenu Prema February 10 2024 Episode 543: పద్మావతి, రమేష్ చంద్రను ఇంటికి తీసుకువచ్చినందుకు ఇంట్లో వాళ్లంతా చాలా కోపంగా ఉంటారు. విక్కీ పద్మావతికి మాట ఇచ్చిన కారణంగా తను ఏం చేసినా కాదనకుండా సైలెంట్ గా ఉంటాడు కానీ చాలా కోపంగా ఉంటాడు పద్మావతి ఎంత నచ్చ చెప్పాలని చూసినా విక్కీ పట్టించుకోకుండా కోపంతో వెళ్లిపోతాడు పద్మావతి ఇంట్లో రమేష్ చంద్ర ని తీసుకువచ్చి పెద్ద తప్పు చేసిందని కృష్ణ మనసులో అనుకుంటాడు. ఇక మనం విక్కీ పద్మావతిని విడదీయాల్సిన అవసరం లేదు వాళ్లంతటి వాళ్లే విడిపోతారు. పద్మావతి తన గొయ్యి తానే తీసుకుంటుందని కృష్ణ సంతోష పడతాడు.

Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights

నారాయణ బాధపడుతూ ఉంటాడు. తన అన్నని విక్కి అలా అగౌరపరుస్తున్నందుకు బాధ పెడుతున్నందుకు నారాయణ బాధపడుతూ ఉంటే, కుచల వచ్చి, నువ్వు ఇప్పుడు మీ అన్నయ్య మీద ఎమోషనల్ అయితే విక్కీ చూసి మనల్ని బయటకు వెళ్ళమంటాడు మనం విక్కీ దృష్టిలో చెడ్డవడం ఎందుకు అయినా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్లిపోతారు అని అంటుంది కుచల మీద నారాయణ కోప్పడతాడు ఎవరే మధ్యలో వచ్చింది ఆయన నా అన్నయ్య అన్న విషయంలో మర్చిపోతున్నావు అని అంటాడు. కుచల నీ కోపంతో అరుస్తూ ఉంటాడు. నీ ఇష్టం నారు నీకు చెప్పాల్సింది చెప్పాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే వచ్చిన ఆర్య, నాన్న నీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ అన్నయ్య అని అక్క ఇద్దరు మారకుండా మనమేం చేయలేము కదా అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights

ఇక పద్మావతి రమేష్ చంద్ర దగ్గరికి వెళ్లి, మావయ్య గారు మీరు ఇలా ఉండడం నాకు అసలు ఇష్టం లేదు మీరు ఎంతో కష్టపడి ఇక్కడికి తీసుకు వచ్చాను మీరు మాత్రం ఇంకా బాధ పడుతూనే ఉన్నారు అని అంటే, ఇంటికి నేను వచ్చి అందరినీ బాధ పెట్టినట్టు ఉంది అని రమేష్ చంద్ర బాధపడుతూ ఉంటాడు. మీరు నారాయణ మావయ్య గురించి ఏమనుకుంటున్నారు అని పద్మావతి అడుగుతుంది వాడంటే నాకు చిన్నప్పటినుంచి చాలా ఇష్టం అమ్మ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టింది లేదు కాకపోతే నేను వాడికి చాలా అన్యాయం చేశాను పసిపిల్లలుగా ఉన్న నా పిల్లల్ని వాడి మీద వదిలేసి నేను వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వాడు మాత్రం కన్నతండ్రి లాగా వాళ్లని పెంచి పెద్ద చేశాడు వాళ్ళ కండగా నిలబడ్డాడు నేను రాముని కాదేమో కాని వాడు మాత్రం లక్ష్మణుడే, కాకపోతే ఇప్పటికి వాడితో నేను మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను అని అంటాడు దానికి పద్మావతి అయితే ఇప్పుడు మాట్లాడండి అని అంటుంది. అక్కడే ఉన్న నారాయణ అని పిలిచే ఇద్దరిని కలుపుతుంది వెంటనే ఇద్దరు అన్నదమ్ములు ఒకటైపోతారు పద్మావతి చాలా సంతోషిస్తుంది పద్మావతి లాంటి కోడలు దొరికినందుకు ఇద్దరు చాలా సంతోషిస్తారు అన్నయ్య నేను నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ విక్కీకి ఎదురు చెప్పలేక ఏమి మాట్లాడలేకపోతున్నాను అని అంటాడు నారాయణ. ఈ మాత్రం అర్థం చేసుకున్నావు అదే చాలు అని అంటాడు రమేష్ చంద్ర ఇక అన్నదమ్మున్ని అలా చూసి పద్మావతి కూడా సంతోషిస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights

ఇక అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మంటుంది పద్మావతి అందరికీ భోజనం వడ్డిస్తుంటే అరవింద్ మాత్రం పద్మావతి మీద చాలా కోపంగా ఉంటుంది రమేష్ చంద్రుని ఇంటికి తీసుకొచ్చి పద్మావతి తప్పు చేసిందని అరవింద బాధపడుతూ ఉంటుంది అరవింద పద్మావతి వడ్డిస్తే వద్దని చెప్తుంది. అనుని వడ్డించమని చెప్తుంది. ఇక విక్కీ కూడా పద్మావతి భోజనం పెట్టి తినమంటే, నాకు ఇష్టమైన వంటలు చేయడం కాదు పద్మావతి నా మనసు తెలుసుకొని ప్రవర్తించడం నేర్చుకోవాలి అంటాడు ఇక అప్పుడే అక్కడికి రమేష్ చంద్ర స్వేత వస్తారు. వాళ్ళిద్దర్నీ భోజనానికి రమ్మని పద్మావతి పిలుస్తుంది వాళ్ళు ఇప్పుడు వద్దులేమ్మా తర్వాత తింటాము అని అంటే బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకు వస్తుంది వెంటనే అరవింద్ కి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతారు మెల్లిగా జారుకుంటుంది. ఇక నారాయణ ఆర్య అను మాత్రమే అక్కడ ఉంటారు వాళ్లతో రమేష్ చంద్రబోస్ భోజనం చేయమని పద్మావతి అడుగుతుంది ఇష్టం లేకపోయినా రమేష్ చంద్ర భోజనం చేస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights

ఇక విక్కీ దగ్గరికి వచ్చిన పద్మావతి ఎందుకు సారు భోజనం చేయకుండా మధ్యలో నుంచి వచ్చేసారు అని అంటే నీకు చిన్నప్పటి నా సంగతులు తెలిసి కూడా ఇలా చేస్తున్నావని నేను చాలా బాధపడుతున్నాను పద్మావతి నాకు మా అమ్మని చంపిన వాడితో కలిసి భోజనం చేయడం ఇష్టం లేదు అలాంటి హంతకులు పక్కన నేను కూర్చుని భోజనం చేయను అని అంటాడు నేను చెప్పేది ఒకసారి వినండి సార్ ఒకప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారు మీకు తెలియదు ఇలా మాట్లాడుతున్నారు అని ఆయనకి ఒంట్లో బాగాలేదు అన్న విషయం చెప్పాలని పద్మావతి ట్రై చేస్తుంది కానీ విక్కీ వినిపించుకోకుండా పద్మావతి దారి చేసి వెళ్ళిపోతాడు. కన్నతల్లి చిన్నప్పుడే చనిపోతే ఎలా ఉంటుందో నీకు తెలియదు పద్మావతి నీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టం అలానే నాకు మా అమ్మంటే చాలా ఇష్టం అలాంటిది మా అమ్మని చంపిన వాడిని ఇంట్లోకి రాణించడం ఒక అయితది వాడితో కలిసి భోజనం చేయమంటావా అని విక్కి అనేసి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 10 2024 Episode 543 Highlights

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి ఆఫీస్ కి వస్తుంది ఆఫీస్ లో పద్మావతి తో సంతకం పెట్టించమని విక్కీ అంటాడు పద్మావతి సంతకం పెట్టి ఇది నేను సక్సెస్ చేసిన ప్రాజెక్టు అనే నా తో సంతకం పెట్టిస్తున్నారు అని అంటుంది ఇక నీ పని అయిపోయింది ఇక్కడి వెళ్లొచ్చు పద్మావతి అని అంటాడు విక్కి ఇంకొక పని ఆగిపోయింది సారు అని పద్మావతి విక్కీ చెంప మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోతుంది. విక్కీ ఏమీ అనలేక అలానే చూస్తూ ఉంటాడు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella