Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రికి తగ్గ తనయురాలు అన్న విధంగా సోషల్ మీడియాలో తన టాలెంట్ నిరూపిస్తూ ఉంటది. అతి చిన్న వయసులోనే సితార ప్రస్తుతం ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మొదటి యాడ్ షూటింగ్ కి కోట్లల్లో వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని చారిటీ చేసేసింది. పేద పిల్లల విషయంలో చిన్న వయసులోనే సితార అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటది. అందరితో కలిసి పోయే మంచి మనస్తత్వం కలిగిన సితార సోషల్ మీడియాలో పలు పాటలకు డాన్స్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటది.
ఇటీవల మహేష్ బాబు కొత్త సినిమా “గుంటూరు కారం” సినిమా పాటలకు కూడా డాన్స్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో సితార చాలా యాక్టివ్ గా ఉంటది. కుటుంబంతో విదేశాలకు వెళ్లిన సమయంలో అక్కడి అందాలను ఫోటోలలో బంధించి.. పోస్ట్ చేస్తుంటది. అంతేకాదు ప్రతి ఏడాది తన పుట్టినరోజు నాడు పేద పిల్లలకు ఏదో ఒక మంచి కార్యక్రమం చేసి వారికి సితార సహాయపడుతూ ఉంటది. సినిమా హీరోలకు సంబంధించిన పిల్లల విషయంలో అతి చిన్న వయసులోనే మంచి గుర్తింపు.. సితార సొంతం చేసుకుంది.
దీంతో ఆమె మంచితనాన్ని..క్రేజ్ ఆధారం చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. విషయంలోకి వెళ్తే సితార పేరిట సైబర్ నేరగాళ్లు ఇతరులకు ఫేక్ ట్రెండింగ్ రీల్స్ పంపించి డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో కొంతమందికి కేటుగాళ్లు ఫేక్ లింక్స్ పంపుతున్నారు. ఈ క్రమంలో ఆ లింక్ క్లిక్ చేసిన వారి అకౌంట్ నుంచి నగదు కాజేస్తున్నారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన మహేష్ బాబు టీం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు సితార పేరిట వచ్చే ఫేక్ అకౌంట్స్ లింక్స్ క్లిక్ చేయొద్దని పోలీసులు హెచ్చరించడం జరిగింది.