NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 06 2023 Episode 1118: స్పృహలోకి వచ్చిన అను ఆర్య కంట పడకుండా వెళ్ళిపోతుందా?.

Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights

Prema Entha Madhuram December 06 2023 Episode 1118: ఇంతలో రౌడీ ఫోన్ చేసి మేడం చూశారు కదా వీడియో అని అంటాడు. చాలా థాంక్స్ భయ్యా ఇన్నాళ్ళకి నా చిరకాల శత్రువు మరణం చూశాను నీకు వెంటనే డబ్బులు పంపిస్తాను అని ఛాయా అంటుంది. కానీ డెడ్ బాడీలను ఏం చేశారు అని మానస అంటుంది. వాళ్లను పొడవగానే చుట్టూ పబ్లిక్ వచ్చేసరికి పరిగెత్తుకుని వచ్చాము మేడం వాళ్లకు కొన ఊపిరి ఉంది అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్లారు అని అతను చెప్తాడు. రేయ్ ఫుల్ చంపకుండా ఎందుకు వదిలిపెట్టారు రా అలా వదిలేస్తే వాళ్ళిద్దరూ మల్లి బ్రతికేస్తారు వాళ్ల ప్రేమకి అంత శక్తి ఉంది అని టెన్షన్ పడుతుందిఛాయా. చూడండి మేడం ఆ కత్తిపోట్లకి వాళ్లు బ్రతికే ఛాన్సే లేదు మీరేం టెన్షన్ పడకండి మేడం అని అతను అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights
Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights

సరే ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు చెప్పరా అక్కడికైనా వెళ్లి ఆ హాస్పటల్లో ఫినిష్ చేస్తాము అని ఛాయా అంటుంది. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు నాకు తెలియదు మేడం అని అతను ఫోన్ కట్ చేస్తాడు. నువ్వెందుకు అంతలా టెన్షన్ పడిపోతున్న వు ఛాయా అని మానస అంటుంది. నీకు అర్థం కావట్లేదు మానస వాళ్లకు కొన ఊపిరి ఉంది అంటే బ్రతికేసినట్టే వాళ్ల ప్రేమ అంత గొప్పది అని ఛాయా అంటుంది. అయితే ఆ స్పాట్ కి వెళ్లి  ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు చూద్దాం పద అక్కడే వాళ్ళని చంపేద్దాం అని మానస అంటుంది. కట్ చేస్తే, జెoడి ఇంకా దాదా ఫోను కలవట్లేదు ఏంటి ఏమై ఉంటుంది అని నీరజ్ అంటాడు. వాళ్ళ ఇంటిదగ్గర ఏదైనా ప్రాబ్లమ్ ఏమో అందుకే ఫోన్ స్విచాఫ్ అయినట్టుంది వెళ్లి చూద్దాం పద అని జెండి అంటాడు. అందుకే జెండి మనము దాదాతో కలిసి గుడికి వెళ్దాము అన్నాను మనం వెళ్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని నీరాజ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights
Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights

సార్ వద్దన్నాడనే కదా సార్ మనం వెళ్లలేదు అని జెoడి అంటాడు. సరే ముందైతే అక్కడికి వెళ్లి చూద్దాం పద అని వాళ్ళిద్దరూ బయలుదేరుతారు. కట్ చేస్తే, నాయనమ్మ అమ్మ ఇంకా ఇంటికి రాలేదేంటి అని ఆకాంక్ష అడుగుతుంది. వస్తుంది లేమ్మా నువ్వు అయితే ముందు వెళ్లి రెడీ అవ్వండి స్కూల్ కి టైం అవుతుంది అని సుగుణ అంటుంది. అమ్మకి ఏమైందో ఏమో నాయనమ్మ ఇంకా ఇంటికి రాలేదు అని అభయ్ అంటాడు.  ఇంటికి వెళ్లిందేమో వారం రోజులు అవుతుంది కదా వెళ్లక ఇల్లంతా చిందరవందరగా ఉంటే సర్దుతుందేమో అని దివ్య అంటుంది. అయితే నేను మీ ఇంటికి వెళ్లి చూసి వస్తాను మీరు స్కూల్ కి వెళ్ళండి పిల్లలు అని సుగుణ అంటుంది. నాయనమ్మ మేము నీతో పాటు ఇంటికి వచ్చి అమ్మను చూస్తాము అని ఆకాంక్ష అంటుంది. వద్దు పిల్లలు మీరు స్కూలుకు వెళ్ళండి అమ్మ స్కూలుకు వెళ్లలేదని కోప్పడుతుంది నేను వెళ్లి చూసి తీసుకు వస్తాను కదా అని సుగుణ వెళుతుంది.

Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights
Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights

కట్ చేస్తే, అను కి తెల్లవారుగానే స్పృహ వస్తుంది. ఆర్య సార్ ఎక్కడ ఉన్నాడు అని రూములన్ని వెతికి తనని చూస్తుంది. చూశారా సార్ నేను భయపడినట్టే మీకు ప్రాణహాని కలిగింది ఇదంతా నా వల్లే నేను పిల్లలు నీకు దగ్గర అవడంతో నీకు ఈ ప్రమాదం అయింది ఇంకెప్పుడు మిమ్మల్ని కలవకుండా చూసుకుంటాను నన్ను క్షమించండి సార్ అని అను బాధపడుతుంది. ఇంతలో నర్స్ వచ్చి తన భుజం మీద చేయి వేస్తుంది. ఎవరు అని  టెన్షన్ పడుతూ తను వెనక్కి తిరిగి చూస్తుంది. నువ్వా నిలా నాకు ఒక సహాయం చేసి పెట్టవా ఆర్య సార్  కంట పడకుండా నన్ను ఇక్కడి నుంచి పంపించు అని అంటుంది అను. ఎందుకక్కా అసలు ఏమైంది అని నీలా అడుగుతుంది. గుళ్లో జరిగిందంతా చెబుతుంది అను. సరే అక్క నేను వాళ్ళ కంట పడకుండా ఇకనుంచి పంపించేస్తాను అని నీలా అంటుంది. కట్ చేస్తే ఇంతలో జెండి నీరజ్ హాస్పిటల్ కి వస్తారు. ఏంటి సార్ ఇలా జరిగింది మేము కూడా నీతో పాటు వస్తే ఇలా జరిగేది కాదు కదా అని జెండి అంటాడు. నాతోపాటు నా భార్య కూడా హాస్పటల్లో జాయిన్ అయింది డాక్టర్ గారు ఎక్కడ ఉంది తను బాగానే ఉందా అని అంటాడు ఆర్య. అంటే దాదా వదినమ్మ మీకు కనిపించిందా అని నీరాజ్ అంటాడు. నా ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణాలు మీదికి తెచ్చుకుంది అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights
Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights

అవునా అయితే వదినమ్మ ను చూద్దాం పద అని నీరజ్ ఆర్యని తీసుకొని వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి అను ఉండదు. డాక్టర్ గారు ఈ రూమంతా ఖాళీగా ఉంది అను ఇక్కడే ఉందా అని అంటాడు ఆర్య. ఇక్కడే నిన్న తనకి ఆపరేషన్ చేసి అబ్జర్వేషన్ లో ఉంచాను సార్ ఎక్కడికి వెళ్లిందో అని నర్సులు పిలిచి అడుగుతాడు డాక్టర్ గారు. సార్ నేను నైట్ ఇంటికి వెళ్లేటప్పుడు తనకు స్పృహ లేదు తెల్లారు గట్ల డ్యూటీకి వచ్చి చూసేసరికి రూమ్లో తను లేదు సార్ ఎక్కడికో వెళ్లిపోయినట్టుంది ఫీజు కట్టలేక వెళ్ళిపోయిందేమో అనుకున్నాను అని నీలా అంటుంది. ఆ విషయం వెంటనే నాకు చెప్పాలి కదా అని డాక్టర్ అంటాడు. సారీ సార్ నేను చూసుకోలేదు అని నీలా అంటుంది. తను దగ్గర అవడం వల్లే నాకు ఈ ప్రమాదం జరిగింది అనుకొని అను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుంది నీరజ్ అను మళ్లీ ఇక నాకు జీవితంలో కనిపించదు ఎందుకు అంటే ఈ ప్రమాదం జరగడం తన వల్లే అని నమ్ముతుంది నన్ను ఈ పరిస్థితుల్లో కూడా వదిలేసి వెళ్ళింది అంటే తను బాగా భయపడి పోయింది అని ఆర్య బాధపడతాడు.

Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights
Prema Entha Madhuram Today Episode December 06th 2023 Episode 1118 Highlights

నీలా తనని వాళ్ల కంట పడకుండా తీసుకువెళ్తుంది.కట్ చేస్తే,పిల్లలు ఇంటి దగ్గర అను కోసం ఏడుస్తూ ఉంటారు. అభయ్ చెల్లి ఏమి తినలేదు నువ్వైనా టిఫిన్ తినరా అని ఉష అంటుంది. ఆ టిఫిన్ తీసుకొని ఆకాంక్ష దగ్గరికి వెళ్తాడు అభయ్. అక్కి లే టిఫిన్ చేద్దువు గాని అని అభయ్ అంటాడు. నాకు వద్దు అన్నయ్య అమ్మ వచ్చిన తర్వాతే తింటాను అని ఆకాంక్ష అంటుంది. అక్కి అమ్మ ఎప్పుడూ కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్లి అక్కడే పడుకుంటుంది కదా నీకు గుర్తు లేదా అని అభయ్ అంటాడు. అవునన్నయ్య అమ్మ ఎప్పుడు గుడికి వెళ్ళినా మనల్ని తీసుకు వెళ్ళేది కదా ఇప్పుడు ఎందుకు తీసుకువెళ్లలేదు అని ఆకాంక్ష అడుగుతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N