Prema Entha Madhuram November 04 Episode 1091: డెత్ సర్టిఫికెట్ చూసి దివ్య స్టాక్ అవుతుంది. సుగుణమ్మ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి సూర్య ని చూసి సూర్య అని తన మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. దివ్య జ్యోతి ఉష కూడా వచ్చి సూర్య మీద పడి ఏడుస్తారు. ఉష ఊరుకొండమ్మ అమ్మ ఏడవకమ్మ అని ఆర్య అంటాడు. ఏంట్రా ఊరుకునేది మా అన్నయ్య అని చెప్పి ఎంత నటించావు రా అని దివ్య అంటుంది. ఎంత నమ్మాను రా నిన్ను నన్ను మోసం ఎలా చేయాలనిపించింది రా నా కొడుకును చంపి నా దగ్గరికి వచ్చి నా కొడుకుగా నటిస్తావా నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావు ఎందుకురా నా కొడుకుని చంపావు నీకేం ద్రోహం చేశాడు అని సుగుణ ఆర్య అని తిడుతుంది. మా కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన నీవు కుటుంబం నాశనం అయిపోతోంది రా అని సుగుణ దుమ్మెత్తి ఆర్య మీద పోస్తుంది. వీడికి ఇలా చెప్తే అర్థం కాదమ్మా అని దివ్య వెళ్లి చెప్పు తీసుకుని ఆర్య అని కొడుతుంది.జ్యోతి ఉషా కూడా వచ్చి కొట్టి ఆర్య ని నెట్టేస్తారు బయటికి. అక్కడే నిలబడి చూస్తున్న ఛాయా జలంధర్ మానస నవ్వుతూ ఉంటారు. నో ఇలా జరగకూడదు అని జలంధర్ గట్టిగా అరుస్తాడు.

అన్నయ్య ఏమైంది అన్నయ్య ఎందుకు అలా గట్టిగా అరిచావు అని ఛాయా అంటుంది.ఇప్పుడే నాకు ఒక కలొచ్చింది అమ్మ సూర్య ని చంపేసిన ఆర్య ని కొట్టి బయటికి గెంటేశారు అని జలంధర్ అంటాడు. అది కలే కదా అన్నయ్య అని ఛాయా అంటుంది. మనం ఇప్పుడు సుగుణ వాళ్ళకి నిజం చెప్తే అదే జరుగుతుందమ్మా వాడు ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు మనకు పగ ఎలా తీరుతుంది అలా జరగకూడదు అంటే సుగుణకు ఇప్పుడే మనం నిజం చెప్పకూడదు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అలా చేస్తే ఆర్య మన గుప్పిట్లో ఉంటాడు అప్పుడు మనం ఏది అనుకుంటే అది చెయ్యొచ్చు అని జలంధర్ అంటాడు. అవునన్నయ్య సెంటిమెంటుకు లొంగిపోయి ఆర్య సూర్యగా వెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు కదా మనం బ్లాక్ మెయిల్ చేసి వాడిని ఒక ఆట ఆడుకోవచ్చు అని ఛాయా అంటుంది.

చూడు ఛాయా వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్ని వివరాలు తెలుసుకుందాము అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని జలంధర్ అంటాడు. కట్ చేస్తే చూడు మహి ఆర్య సార్ ని కాపాడబోయి సూర్య చనిపోయాడని నీకు కూడా తెలుసు తన స్థాయిని వదిలిపెట్టి వాళ్ళ ఇంటికి కొడుకుగా వెళ్ళాడు అలాంటి సార్ కి నీ సహాయం అవసరం వచ్చింది నువ్వు చేస్తావా అని జెండి అంటాడు. నాకు మంచి జీవితాన్ని ఇచ్చి ఉద్యోగం ఇచ్చారు నా కుటుంబం బ్రతుకుతున్నది అంటే సారు వల్లనే సహాయం చేయమని మీరు అడగకూడదు సార్ ఆర్డర్ వేయండి చేస్తాను అని మహి అంటాడు. చూడు మహి సూర్య వాళ్ళ చెల్లెలు దివ్య ని నువ్వు పెళ్లి చేసుకుంటావా తను బాధ్యత తెలిసిన అమ్మాయి కుటుంబం కోసం చదువు మానేసి ఉద్యోగం చేస్తుంది అలాంటి అమ్మాయి నీకు భార్య అయితే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అందుకని నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని ఆర్య మహిని అడుగుతాడు. సార్ మీరు ఇంతలా చెప్పాల్సిన పనిలేదు రేపే మా అమ్మా నాన్న ని తీసుకొని పెళ్లి చూపులకు వస్తాము అని మహి అంటాడు.

కట్ చేస్తే అమ్మ ఈ చీర దివ్యకు ఇవ్వమ్మా అని ఆర్య అంటాడు. ఇప్పుడు చీర దివ్యకి ఎందుకు తెచ్చావు నాన్న అని సుగుణ అంటుంది. అమ్మ దివ్యకి ఒక మంచి సంబంధం చూశాను రేపు వాళ్ళు దివ్య ని చూసుకోవడానికి వస్తున్నారు అందుకే చీర తెచ్చానమ్మ దివ్యకి చీర ఇచ్చి రేపు రెడీ కమ్మని చెప్పు పెళ్లిచూపులకి అని ఆర్య అంటాడు. చాలా మంచి పని చేశావు నాన్న నినే నీతో చెబుదామనుకున్నాను ఈ లోపు నువ్వే సంబంధం చూసావా అని సుగుణ అంటుంది. ఇంతలో దివ్య అక్కడికి వస్తుంది.దివ్య ఈ చీర తీసుకోమ్మా అన్నయ్య నీకోసం తెచ్చాడు రేపు నీకు పెళ్లి చూపులు అని సుగుణ అంటుంది. ఎవరిని అడిగి ఈ పెళ్లి చూపులకు ఏర్పాటు చేశారు అంతా మీ ఇష్టమేనా నన్ను అడగక్కర్లేదా అని దివ్య అంటుంది. అది కాదమ్మా ఆ అబ్బాయి నాకు చాలా బాగా తెలుసు తనకు చదువు అందం ఉద్యోగం అన్నీ ఉన్నాయి అని ఆర్య అంటాడు.బాగా తెలుసు అంటున్నావు ఏ జైల్లో పరిచయమయ్యాడు ఏంటి అని దివ్య అంటుంది.

దివ్య ఏం మాట్లాడుతున్నావు నోరుమీ అని సుగుణ అంటుది. లేకపోతే ఏంటమ్మా వచ్చి పది రోజులు కూడా అవ్వట్లేదు అప్పుడే ఈయనకి బాగా తెలుసు అంటే ఏంటి అర్థం ఏదో బాధ్యత తీసుకుంటున్నట్టు అమ్మ దగ్గర నటించకు అని దివ్య అంటుంది. అది కాదమ్మా మనకు వంట కాంట్రాక్టు ఇచ్చిన సార్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటే అక్కడ తను పరిచయం అయ్యాడు అక్కడ పెళ్లి టాపిక్ వచ్చేసరికి నేను ఆ అబ్బాయి తో మాట్లాడాను చాలా అందంగా ఉన్నాడు ఉద్యోగం ఉంది ఇంకేం కావాలి చెప్పమ్మా అని ఆర్య అంటాది. దివ్య వచ్చిన కానుంచి చూస్తున్నాను అన్నయ్యను ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు ఏంటి అందం ఉంది చదువుంది అంతకంటే ఇంకేం కావాలి అన్నయ్య చెప్పినట్టు ఆ పెళ్లి చేసుకో అంతే నా కొడుకు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు రేపు నీకు పెళ్లిచూపులు నువ్వు రెడీ అవుతున్నావు అంతే అని సుగుణ అంటుంది. అమ్మ అది కాదమ్మా నేను చెప్పేది ఒకసారి వినమ్మ అని దివ్య అంటుంది.

నువ్వు నాకు ఇంకా చెప్పేదేమీ లేదు రేపు నీకు పెళ్లి చూపులు అని సుగుణ అంటుంది. ఆ మాటలు విన్న దివ్య కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా చెల్లె మీద అంతలా కోప్పడుతున్నావు తను బాధపడుతుంది కదా అని ఆర్య అంటాడు. నా కొడుకును ఎవరైనా ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది సూర్య అమ్మ అలా ఆలోచిస్తున్నావు నాన్న అలా అర్థం చేసుకుంటున్నావు దానికి ఇంతకన్నా మంచి సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు అని సుగుణ అంటుంది.దివ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మా అన్నయ్య సంబంధం తెచ్చాడు రేపు పెళ్లి చూపులు అందుకే నీకు ముందే చెప్పాను లైఫ్ లో సెటిల్ కా మనం పెళ్లి చేసుకుందాము అని నువ్వు వినట్లేదు అని దివ్య అంటుంది. చూడు దివ్య ఇప్పుడు ఏం జరిగిందని పెళ్లి చూపులే కదా పెళ్లిచూపులు అయిపోయాక అబ్బాయి నచ్చలేదని చెప్పు సింపుల్ అని అతను అంటాడు.

నీకు అంతా సింపుల్గానే అనిపిస్తుంది కానీ ఇక్కడ అలా లేదు మా అమ్మ కచ్చితంగా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిందే అని మా అమ్మ అంటుంది అని దివ్య అంటుంది. నువ్వు టెన్షన్ పడకు దివ్య నేను చూసుకుంటానులే అని అతను అంటాడు. కట్ చేస్తే సుగుణ అను కి ఫోన్ చేసి అనురాధ ఎలా ఉన్నావు అమ్మ పిల్లలు బాగున్నారా అని సుగుణ అంటుంది.బాగానే ఉన్నారా ఆంటీ మీరు ఎలా ఉన్నారు మీ అబ్బాయి బాగున్నాడా అని అను అంటుంది. బాగానే ఉన్నాడమ్మా కానీ దివ్యకి పెళ్లి సంబంధం తెచ్చాడు దివ్య కాదు కూడదు అంటుంది నేను పెళ్లి చేసుకోవాల్సిందే అని గట్టిగా మందలించాను అందుకే అను నువ్వు వచ్చి దివ్యకు కాస్త నచ్చచెప్పు అని సుగుణ అంటుంది. ఆంటీ నేను నచ్చ చెప్తే దివ్య వింటుందంటావా మీ ఫ్యామిలీ విషయంలో నేను జోక్యం చేసుకోవడం ఎందుకు అని అను అంటుంది. అదేంటమ్మా అలా అంటావు నిన్ను ఎప్పుడైనా పరాయి మనిషిలా చూసామా అని సుగుణ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది..