Kaju Katli: డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన జీడిపప్పు మన ఆరోగ్యానికి మంచిది.. కొన్ని రకాల స్వీట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. వాటిల్లో కాజు కాట్లీ కూడా ఒకటి.. జీడిపప్పు తో చేసే కాజు కాట్లీ శరీరానికి శక్తిని అందించడమే కాదు.. శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కాజు కాట్లీ పర్ఫెక్ట్ టెస్టు వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు..
జీడిపప్పు 250 గ్రాములు, పంచదార 250 గ్రాములు, పాలు 250ml, యాలకుల పొడి అర చెంచా, నెయ్యి రెండు చెంచాలు.
జీడిపప్పును రెండు గంటల పాటు నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీరు తీసేసి జీడిపప్పును మిక్సీ జార్ లో వేసి తగినన్ని పాలు పోసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట సిమ్ లో ఉంచి పాన్ పెట్టాలి. అందులో పంచదార వేయాలి ఆ తర్వాత జీడిపప్పు పేస్టును కూడా వేసి కలుపుతూ ఉండాలి. కలిపేటప్పుడు అడుగు అంటకుండా చూసుకోవాలి. లేదంటే మాడిపోతుంది. కాసేపటికి కాజు దగ్గరకు చేరుతుంది అప్పుడు చిన్న ముద్దలా తీసుకొని ఉండలా చేసుకోవాలి. అలా ఉండలా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసాక రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి. అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి తక్కువగా వేసుకోవాలి ఈ మిశ్రమ బాగా అరే వరకు ఉంచాలి. ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని ఆ ప్లేట్ అంతా సమానంగా పరుచుకోవాలి. 10 గంటలు ఆ ప్లేట్లో పక్కకు పెట్టేసి ఉంచాలి. తర్వాత మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. అంతే కాజు కట్లెట్ రెడీ ఇది నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది.