Today Horoscope:  మే 12 – వైశాఖమాసం – రోజువారీ రాశి ఫలాలు

Share

Today Horoscope:  మే 12 – బుధవారం – వైశాఖమాసం

మేష రాశి

పనులు నిదానంగా పూర్తి చేస్తారు. రాబడి నిరుత్సాహపరుస్తుంది. కొత్త నిర్ణయాలలో తొందరపాటు వద్దు. భార్యాభర్తల మధ్య కలహాలు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు కొంత గందరగోళంలో పడతారు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు ఎదురవుతాయి. కళాకారులకు మరిన్ని చికాకులు. ఐటీ నిపుణులకు అవకాశాలు దూరం కాగలవు. మహిళలు కుటుంబసభ్యులతో విభేదిస్తారు. షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు కనిపించవు.

అదృష్ట రంగులు….తెలుపు, కాఫీ.

రెమిడీ..దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం

పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో మంచి చెడ్డా విచారిస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఉద్యోగయత్నాలలో కొంత అనుకూలత, కాంట్రాక్టర్లకు నూతనోత్సాహాం, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు ఉత్సాహానిస్తాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు వివాదాలు తీరతాయి. ఐటి నిపుణులు కార్యసాధనలో విజయం పొందుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు, మహిళలకు కుటుంబ సభ్యుల ఆదరణ లభిస్తుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు..నీలం, అకుపచ్చ

రెమిడీ.. విష్ణుసహస్ర నామ పారాయణ చేయాలి.

మిథున రాశి

రుణ బాధలు తప్పవు. ఇంటాబయటా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. పనులలో ప్రతిబంధకాలు. కాంట్రాక్టర్లకు చిక్కులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు. పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. మహిళలకు మానసిక అశాంతి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు…..పసుపు, కాఫీ.

రెమిడీ..శివ స్తోత్రాలు పఠించాలి.

కర్కాటకం

కుటుంబ సభ్యుల సూచనలు పాటిస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభ వార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఉత్సవాలలో పాల్గొంటారు. దైవ కార్యాలు చేపడతారు. కొత్త కాంట్రాక్టులు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. మహిళలకు నూతన ఉత్సాహం. విద్యార్థుల యత్నాలు సఫలం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….. గోధుమ, తెలుపు.

రెమిడీ.. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. సమాజ సేవలో నిమగ్నమవుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పుణ్య క్షేత్రాల సందర్శనం. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. ఐటీ నిపుణులు ఆశించిన అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు తీరతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….. నీలం, నలుపు.

రెమిడీ..శివ పంచాక్షరి పఠించండి.

కన్య

దూర ప్రయాణాలు వాయిదా. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. బంధు మిత్రులతో విభేదాలు. ఒక విషయంలో పొరపాట్లు దొర్లి నిరాశ చెందుతారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు. దైవకార్యాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు కలిసిరావు. వ్యాపార వర్గాలకు నిరాశే మిగులుతుంది. ఉద్యోగాల్లో అదనపు పనిభారం. కళాకారులు, రాజకీయవేత్తలకు చికాకులు. ఐటీ నిపుణుల ప్రయత్నాలు మందగిస్తాయి.  విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలి.  మహిళలకు నిరుత్సాహమే. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు….. ఆకుపచ్చ, బంగారు.

రెమిడీ ..వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

తుల

ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్పులు. శారీరక రుగ్మతలు. కష్టించినా ఫలితం అంతగా ఉండదు. రియల్ ఎస్టేట్ల వారు వివాదాలపై కలత చెందుతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు కొన్ని చికాకులు. విద్యార్థుల యత్నాలు కొంత నిరాశ పరుస్తాయి. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….. నీలం, ఆకుపచ్చ.

రెమిడీ.. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం

ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. కొన్ని రుణ బాధలు తొలగుతాయి. అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై బంధువులతో చర్చలు. రియల్ ఎస్టేట్ల వారు అనుకున్న లాభాలు పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, రాజకీయవేత్తలకు సంతోషకర సమాచారం. ఐటీ నిపుణులు ప్రతిభ నిరూపించు కుంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలు శుభ వార్తలు వింటారు. షేర్ల విక్రయాలలో లాభాలు రాగలవు.

అదృష్ట రంగులు…..ఆకుపచ్చ, పసుపు.

రెమిడీ..లక్ష్మీస్తుతి మంచిది.

ధనుస్సు

నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మీ మాటే నెగ్గుతుంది. మిత్రుల సాయంతో వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ల వారికి భూ లాభాలు ఉండవచ్చు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు కోరుకున్న పదోన్నతులు లభిస్తాయి. కళాకారులు, ఐటీ నిపుణులకు అంచనాలు నిజమవుతాయి. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు…..ఎరుపు, పసుపు.

రెమిడీ.. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

మకరం

పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు తప్పవు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. శారీరక రుగ్మతలు. కాంట్రాక్టులు తప్పిపోవచ్చు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. కళాకారులకు చిక్కులు. ఐటీ నిపుణులు కొన్ని విషయాలలో నిదానం పాటించాలి. విద్యార్థులకు విదేశీ అవకాశాలు నిరాశ పరుస్తాయి. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు…..కాఫీ, బంగారు.

రెమిడీ.. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

కుంభం

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కొన్ని ఆసక్తికర సమాచారాలు అందుతాయి. మహిళలకు శుభ వర్తమానాలు. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు…..ఎరుపు,కాఫీ.

రెమిడీ.. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

మీనం

కొత్త పనులు చేపడతారు. సోదరుల చేయూతతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల వివాదాలు తీరి ఊరట చెందుతారు. వాహనాలు, భూములు కొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. దైవరాధన కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త సమస్యలు. ఐటీ నిపుణులకు వివాదాలు పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. షేర్ల విక్రయాలలో తొందరవద్దు.

అదృష్ట రంగులు…..గులాబీ, నీలం.

రెమిడీ.. హయగ్రీవ స్తోత్రాలు పఠించాలి.


Share

Related posts

Today Horoscope: జూన్ 3 – వైశాఖమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma

Today Horoscope సెప్టెంబర్ 30th బుధవారం మీ రాశి ఫలాలు

Sree matha

Daily Horoscope ఆగష్టు 29th శనివారం మీ రాశి ఫలాలు

Sree matha