Today Horoscope: మే 16- వైశాఖమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Share

Today Horoscope: మే 16- ఆదివారం – వైశాఖమాసం

మేషం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. మీ అంచనాలు  నిజమవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ, కళారంగాల వారు అడుగు ముందుకు వేస్తారు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు భూసంబంధిత లాభాలు.

అదృష్ట రంగులు… గోధుమ, పసుపు.

రెమిడి.. గాయత్రీ దేవిని పూజించండి.

వృషభం

ఆర్థికపరమైన ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలలో ఆటంకాలు. మీ ప్రయత్నాలు అనుకూలించవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. అనారోగ్యం, ఔషధ సేవనం. వ్యాపారాలలో ఒడి దుడుకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి నిరాశ తప్పదు. విద్యార్థులు కొంత ఓపిక వహించాలి. మహిళలకు మానసిక అశాంతి.

అదృష్ట రంగులు… గోధుమ, ఎరుపు.

రెమిడి.. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

మిథునం

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కలసి వస్తాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. మీ ఆశయాల సాధనలో మిత్రులు సహకరిస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి విషయాలలో సోదరులతో ఒప్పందాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలలో ముందంజ వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు దక్కుతాయి. పారిశ్రామిక, జకీయవర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు సంతోషకరమైన సమాచారం. అదృష్ట రంగులు… గులాబీ, లేత పసుపు.

రెమిడి ..విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

కర్కాటకం

పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. కాంట్రాక్టులు చేజారతాయి. అనారోగ్యం. చికాకులు. రాబడి తగ్గుతుంది. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులు శ్రమ ఫలించక నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు.

అదృష్ట రంగులు… కాఫీ, తెలుపు.

రెమిడి. హనుమాన్ పూజలు మంచిది.

సింహం

దూర ప్రాంతాల నుంచి శుభ వర్తమానాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా జరుగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఉపశమనం పొందుతారు. పారిశ్రామిక,కళారంగాల వారికి యోగదాయకమైన కాలం. విద్యార్థులు పరిశోధనలు ఫలించి ముందుకు సాగుతారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు.

అదృష్ట రంగులు… బంగారు, తెలుపు.

రెమిడి.. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య

ఉద్యోగయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవమర్యాదలు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. చిరకాల ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంత కాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు.

అదృష్ట రంగులు… ఎరుపు, ఆకుపచ్చ.

రెమిడి.. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

తుల

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువర్గంతో విభేదాలు. శ్రమకు తగ్గ ఫలితం రాక డీలా పడతారు. వాహనాలు, ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. సోదరులు,మిత్రులతో కలహాలు. భవిష్యత్ పై కొంత ఆందోళన చెందుతారు. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగుల కు అనుకోని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులు లక్ష్యసాధనలో వెనుకపడతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు.

అదృష్ట రంగులు… కాఫీ, ఆకుపచ్చ.

రెమిడి.. హనుమాన్చాలీసా పఠించండి.

వృశ్చికం

అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. ఆర్థికంగా ఇబ్బందులు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. భూ వివాదాలు నెలకొంటాయి. చర్మ సంబంధిత రుగ్మతలు. వ్యాపారులకు పెట్టుబడుల్లో నిరుత్సాహం. ఉద్యోగులకు స్థాన చలనం. పారిశ్రామిక, పరిశోధన రంగాల వారికి ఒత్తిడులు. విద్యార్థులు కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు మానసిక అశాంతి.

అదృష్ట రంగులు… కాఫీ, తెలుపు

రెమిడి.. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

కొత్త పనులు చేపడతారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. సన్నిహితుల నుంచి శుభ వర్తమానాలు. ఆస్తి వివాదాలు తీరి సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు.  దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు పర్యటనలు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం.

అదృష్ట రంగులు… గోధుమ, బంగారు.

రెమిడి.. కనకధారా స్తోత్రం పఠించాలి.

మకరం

ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కలసి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. విద్యార్థులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. మహిళలకు గౌరవ పురస్కారాలు.

అదృష్ట రంగులు… కాఫీ, పసుపు.

రెమిడి .. దుర్గాదేవిని పూజించాలి.

కుంభం

ప్రయాణాలలో ఆటంకాలు. పనులు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో కలహాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఒడిదుడుకులతో సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినీయవు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

అదృష్ట రంగులు… పసుపు, బంగారు.

రెమిడి.. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

మీనం

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. శ్రమ తప్పదు. బంధు విరోధాలు. పనులలో అవాంతరాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విలువైన సామగ్రి జాగ్రత్త. అనారోగ్య సూచనలు. మీ కష్టానికి తగ్గ ఫలితం రాక ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు అనారోగ్యం.

అదృష్ట రంగులు… ఆకుపచ్చ, గోధుమ.

రెమిడి .. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


Share

Related posts

Today Horoscope: మే 31 – వైశాఖమాసం – రోజువారీ రాశి ఫలాలు

somaraju sharma

Daily Horoscope ఆగష్టు 30th ఆదివారం మీ రాశి ఫలాలు

Sree matha

సిద్ధేశ్వరస్వామికి వేంకటేశ్వరుడు వరమిచ్చిన స్థలం మీకు తెలుసా ?

Sree matha