Today Horoscope: మే 28 – వైశాఖ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Share

Today Horoscope: మే 28 – శుక్రవారం – వైశాఖ మాసం

మేషం

వ్యవ హారాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని మార్చులు ఎదురవుతాయి. రాబడి అంతగా కనిపించదు. కుటుంబ సభ్యులతో తగాదాలు. వాత సంబంధిత రుగ్మతలు. కొన్ని వ్యవహారాలలో వ్యూహాలు తప్పుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. కళాకారులకు కొన్ని అవకాశాలు తప్పిపోవచ్చు. విద్యార్థులు ఫలితాల పట్ల అసంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు. షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించాలి.

అదృష్ట రంగులు….ఎరుపు, ఆకుపచ్చ.

రెమిడి..గణపతి ఆరాధన మంచిది.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

రుణ దాతల నుంచి ఒత్తిడులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు. వ్యాపారాలలో ప్రతిబంధకాలు. ఉద్యోగాల్లో చికాకులు ఎదుర్కొంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. కళాకారులకు నిరుత్సాహమే. విద్యార్థులు కొంత శ్రమ పడాల్సిన సమయం. మహిళలకు నిరుత్సాహం. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….ఎరుపు, కాఫీ.

రెమిడి.. శివ స్తోత్రాలు పఠించాలి.

మిథునం

వ్యవహారాల్లో ఊహించని విజయం. శుభవార్తలు అందుతాయి.

దూరపు బంధువుల కలయిక. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆకస్మిక ధన లాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు అందుతాయి. కళాకారులకు ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…. ఎరుపు,కాఫీ.

రెమిడి … విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

కర్కాటకం

ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువుల సలహాలు పొందుతారు. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పాత బాకీలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి నూతనోత్సాహం. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….ఎరుపు. కాఫీ.

రెమిడి … హనుమాన్ చాలీసా పఠించాలి.

సింహం

శ్రమాధిక్యం తప్పదు. బంధువులతో విరోధాలు. మానసిక అశాంతి. దూర ప్రయాణాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. రాబడి తగ్గుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. రాజకీయ, పారిశ్రామిక  వర్గాలకు ఒత్తిడులు తప్పవు. కళాకారులు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొంత అసంతృప్తి తప్పదు. మహిళలకు నిరుత్సాహం. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు…. పసుపు, గోధుమ

రెమిడి .. లక్ష్మీగణపతిని ఆరాధించాలి

కన్య

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. అంచనాలు తప్పి నిరాశ కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి విమర్శలు. ప్రయాణాల్లో మార్పులు. కుటుంబ సభ్యుల వైఖరి కొంత మనస్తాపం కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. సొమ్ము అందక కొంత ఇబ్బంది పడతారు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులు విధి నిర్వహణలో తొందరపాటు పడరాదు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఒత్తిడులు. కళాకారులకు అవకాశాలు తప్పిపోతాయి. విద్యార్థులకు పరీక్షాకాలమే. మహిళలకు అనారోగ్య , కుటుంబ సమస్యలు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు….కాఫీ, తెలుపు.

రెమిడి.. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

తుల

ప్రత్యర్థులు సైతం విధేయులుగా మారతారు. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. విద్యార్థులకు లక్ష్యాలను చేరుకుంటారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….గులాబీ, తెలుపు.

రెమిడి .. ఆంజనేయస్వామిని పూజించండి.

వృశ్చికం

ఆకస్మిక ప్రయాణాలు. రాబడి తగ్గుతుంది. రుణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు. శ్రమ పెరుగుతుంది.జ్వర సంబంధిత రుగ్మతలు. దూరపు బంధువులను కలుసుకుని చర్చలు జరుపుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఇంటాబయటా ఒత్తిడులు. కళాకారులకు కొంత గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు ఫలితాలుఅంతగా సంతృప్తినీయవు. మహిళలకు ఒడిదుడుకులు. షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా దక్కవు.

అదృష్ట రంగులు….పసుపు, కాఫీ.

రెమిడి.. సత్యనారాయణస్వామిని పూజించాలి.

ధనుస్సు

పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విజయవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు నూతనోత్సాహం. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…. కాఫీ. గులాబీ.

రెమిడి … గణపతికి గరిక పూజ చేయించుకోవాలి.

మకరం

వ్యయప్రయాసలతో పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు ఉండవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా సమస్యలు ఎదుర్కొంటారు. గొంతు సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలలో జాప్యం. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు దక్కక నిరుత్సాహపడతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలలో నిదానం పాటించాలి.

అదృష్ట రంగులు….లేత పసుపు, నీలం.

రెమిడి .. గణపతి ఆరాధన మంచిది.

కుంభం

వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలై ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు విజయవంతంగా గడుస్తుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, గోధుమ,

రెమిడి .. శివాలయంలో ఆవునేతి దీపం వెలిగించండి.

మీనం

సన్నిహితుల సాయంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తీర్థ యాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవంపొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారమై లబ్ధిపొందుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి, విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులకు పరిశోధనల్లో అవకాశాలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు…. గోధుమ, గులాబీ.

రెమిడి .. విష్ణుసహ్రనామ పారాయణం మంచిది.


Share

Related posts

Today Horoscope జనవరి -17- ఆదివారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha

Daily Horoscope జూలై 7 మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha

పూజ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

Sree matha