NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Ukraine Crisis: రేపు ముచ్చటగా మూడో సారి..! సర్వత్రా ఆసక్తి

Ukraine Crisis: ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. గత 11 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధానితో సహా పలు ప్రధాన నగరాలను ఆధీనంలోకి తీసుకునేందుకు రష్యా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రష్యా సైనిక చర్యను ఉక్రెయిన్ సతవిధాలుగా అడ్డుకుంటోంది. ఈ తరుణంలో మరో సారి రేపు రష్యా – ఉక్రెయన్ ల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. మూడవ సారి జరుగుతున్న చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బెలారస్ వేదికగా రెండు పర్యాయాలు చర్చలు జరిగినా అసంతృప్తిగా ముగిసాయి. ఇరు దేశాల షరతుల షరతుల నేపథ్యంలో చర్చలు ముందుకు సాగలేదు.

Ukraine Crisis Tomorrow peace talks
Ukraine Crisis Tomorrow peace talks

Read More: Ukraine Russia War: మోడీజీ మరో సారి మాట్లాడండి

Ukraine Crisis: విరామం ఇచ్చినట్లే ఇచ్చి..

దీంతో మరో సారి చర్చలకు సిద్ధమయ్యింది ఉక్రెయిన్. రష్యా కూడా చర్చలకు అంగీకారం తెలియజేసింది. రేపు జరిగే చర్చల్లో సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కు తగ్గెదే లే అంటున్నారు. ప్రపంచ దేశాలకు ఆయన ఇప్పటికే హెచ్చరికలు పంపారు. ఉక్రెయిన్ నుండి పౌరులు సురక్షితంగా తరలింపునకు వీలుగా దాడి నుండి మేరియుపొల్, వోల్నోవాఖ నగరాల్లో కాస్త విరామం ఇస్తామని ప్రకటించిన రష్యా.. విరామం ఇచ్చినట్లే ఇచ్చి మరల కొద్ది గంటల్లోనే యథావిధిగా దాడులు కొనసాగించింది. క్షిపణులు, రాకెట్లు, బాంబుల దాడి నుండి ఉక్రెయిన్ కాసేపు ఊరట లభించినట్లు కనిపించినా అంతలోనే రష్యా మరో సారి విరుచుకుపడి వారి ఆశలను అడియాసలు చేసింది.

ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తే..

సురక్షితంగా నగరాన్ని దాటించేందుకు వేల మంది ప్రజలను బస్సుల్లో సిద్ధం చేసినా బాంబుల మోత ఆగకపోవడంతో తరలింపు ప్రక్రియ నిలిపివేసినట్లు మేరియుపొల్ మేయర్ ప్రకటించారు. మరో పక్క ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్న జెలెన్ స్కీ డిమాండ్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశమైనా ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ (నిషిద్ధ గగనతలం) గా ప్రకటిస్తే ఆ దేశం కూడా అక్కడి యుద్దంలో పాల్గొంటున్నట్లుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ తరుణంలో రేపు జరిగే చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Related posts

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N