సినీ ఇండ్రస్టీలో డ్రగ్స్ కలకలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు అరెస్టు కూడా అయ్యారు. తాజాగా టాలివుడ్ నటి ఒకరు డ్రగ్స్ కేసులో రెడ్ హాండ్ గా పట్టుబడ్డారు. ముంబైలోని ఓ హోటల్ లో ఆదివారం ఎన్ సీ బీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఓ నటితో పాటు డ్రగ్స్ విక్రయదారు చాంద్ మహమ్మద్ ను ఎన్ సీ బీ అధికారులు అరెస్టు చేశారు.
సుమారు పది లక్షల విలువ చేసే 400 గ్రాముల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ డ్రగ్స్ విక్రయదారు చాంద్ మహమ్మద్ పై పలు కేసులు ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా చేసే సయ్యద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. ఎన్ సీ బీ అధికారులు అదుపులోకి తీసుకున్న సినీ నటి, డ్రగ్స్ విక్రయదారు చాంద్ మహమ్మద్ లను విచారిస్తున్నారు. ఈ విచారణలో మరి కొంత మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా నటి అరెస్టు కావడం టాలీవుడ్ ఇండ్రస్టీలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.