రాజస్థాన్ లో హస్తవాసి

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో హస్తం విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజారిటీ స్థానాలు సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 119 నుంచి 141 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీ 55 నుంచి 72 స్థానాలలోనూ, ఇతరులు 4 నుంచి 11 స్థానాలలోనూ గెలిచే అవకాశం ఉంది.