లాలూకి బెయిల్

99 views

దాణా కుంభకోణంలో దోషిగా నిర్ధారణ అయ్యి జైలు శిక్ష అనుభవిస్తున్నా ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు తాత్కాలిక బెయిలు మంజూరు అయ్యింది. ఢిల్లీ పటియాలా కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో పటియాలా కోర్టు ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.  రైల్వే క్యాటరింగ్, అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణంలో కోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసినప్పటికీ ఆయన జెయిలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఇలా ఉండగా ఈ కేసు విచారణను కోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి ప్రసాద్ కూడా కోర్టుకు హాజరయ్యారు.