బిగ్ బాస్ హౌస్ లో తన మైండ్ గేమ్ మరియు మెచ్యూర్ మెంటాలిటీ తో ఒక్కసారి కెప్టెన్ కాకపోయినా ట్రోఫీ గెలుచుకుని అందరికీ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు అభిజిత్. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి టార్గెట్ టైటిల్ విన్నర్ కావాలి అన్న తరహాలో అభి వేసిన స్ట్రాటజీ లు చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్ ని మాత్రమేగాక సెలబ్రిటీలను సైతం ఆకట్టుకోవడం జరిగింది.
అందువల్లే గత మూడు సీజన్ల కంటే ఈసారి నాలుగో సీజన్ కి చాలామంది సెలబ్రిటీలు అభి కి సపోర్ట్ చేయటం జరిగింది. దీంతో ప్రస్తుతం బయట ఇంటర్వ్యూలు ఇస్తున్న అభిజిత్ తనకు సపోర్ట్ చేసిన సెలబ్రిటీలను ఒక లిస్టు గా చేసుకుని ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
ఇక కెరీర్ పరంగా ఇండస్ట్రీ లో హీరోగా నిలదొక్కుకోవాలని తన తల్లి కోరిక మేరకు ఆ తరహాలోనే ముందుకు సాగి పోవడానికి రెడీ అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక లైఫ్ పార్టనర్ విషయంలో ఛాయిస్ మొత్తం తన తల్లికి ఇచ్చేశానని చెప్పాడు అభిజిత్. ‘‘ఈ రోజు నేను అందరి ఎదుట ఇలా నిలబడగలిగానంటే… అది నా ఒక్కడి సమర్థత, కాదు. అమ్మ, నాన్న, తమ్ముడు, నానమ్మ అందరి ఆశలు, ప్రయత్నం, శ్రమ ఉన్నాయి. వాళ్లు మంచి చదువుని, మంచి జీవితాన్నిచ్చారు. నా జీవితంలో, మా కుటుంబంలో చక్కగా ఇమిడిపోగలిగిన అమ్మాయి ఎంపిక కూడా మా అమ్మ అయితేనే కరెక్ట్‌గా చేయగలుగుతుంది. ఓకే… థాంక్యూ’’ అంటూ ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ లోఅభిజీత్ చెప్పుకొచ్చాడు.