తెలంగాణ‌ న్యూస్

Amit Shah: తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలంటూ దిశానిర్దేశం చేసిన అమిత్ షా

Amit Shah Hyderabad tour
Share

Amit Shah: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు పని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ ముగింపు కార్యక్రమానికి హజరయ్యేందుకు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా..శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో పార్టీ తెలంగాణ కోర్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీలో పార్టీ తెలంగాణ శాఖకు అమిత్ షా కీలక సూచనలు చేశారు.

Amit Shah Hyderabad tour
Amit Shah Hyderabad tour

టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలి

కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సంబందించి అంతర్గతంగా రూపొందించిన ఓ నివేదికను ప్రస్తావిస్తూ అమిత్ షా పలు కీలక సూచనలు చేశారు. తదుపరి తుక్కగూడలో జరగనున్న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సమావేశానికి వెళ్లారు.

ఆ నేతలతో ప్రత్యేక భేటీ

కాగా ఈ భేటీలో భాగంగా బీజేపీ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ కీలక నేత విజయశాంతిలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు మాదిరిగానే తెలంగాణకు కేంద్రం నిధులు ఇస్తోందని అమిత్ ఈ సందర్భంగా వెల్లడిస్తూ ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.


Share

Related posts

ఈ అలవాట్లకి మీ మెదడుని దూరంగా ఉంచండి

Kumar

జూలై 1 నుండి మళ్ళీ లోక్ డౌన్..?

somaraju sharma

మీకు ఉదయాన్నే ఫోన్ చూసే అలవాటు ఉందా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar