ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravati: మూడు రాజధానుల అంశంపై బీజేపీ ఎంపీ జీవిఎల్ కీలక వ్యాఖ్యలు

Share

Amaravati: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహారావు మూడు రాజధానుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలో శనివారం ఆయన పర్యటించి టిడ్కో ఇళ్లు, ఎస్ఆర్ఎం, విట్, ఎన్ ఐ డీ కాలేజీలను నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులు అనేది వైసీపీ రాజకీయ ఎత్తుగడే అని విమర్శించారు. హైకో్ర్టు తీర్పు అమల్లో ఉండగా మూడు రాజధానులు అంటే తీర్పును దిక్కరించినట్లేనని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లలేదన్నారు. మూడు రాజధానులు సాధ్యం కాదని జగన్ కు అర్ధమైపోయిందని లేదంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం చేసే వారని అన్నారు.

BJP mp gvl comments on amaravati capital
BJP mp gvl comments on amaravati capital

Amaravati: అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి

రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తోందని జీవిఎల్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం పనులు చేయకుండా అభివృద్ధిని అటకెక్కించిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కూడా అసమర్ధత వల్ల పనులు చేయలేదని అన్నారు. ఇదే అదనుగా జగన్ రాజధాని నిర్మాణ పనులు నిలిపివేశారన్నారు. అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయా సంస్థలకు తాను లేఖ రాసినట్లు చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని జీవిఎల్ సూచించారు. రాజకీయాల కోసం అమరావతిని బలి చేయవద్దని ఎంపి అన్నారు.

పూర్తి సామర్ధ్యం మేరకు కేంద్రం ఏపికి సాయం

అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని బీజేపీ గతంలోనే తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి కనీస వసతులు కల్పిస్తే అమరావతి అభివృద్ధి చెందుతుందని అన్నారు జీవిఎల్. ప్రముఖ సంస్థలు రాజధానికి రావాలంటే మౌలిక సదుపాయలు ముఖ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పూర్తవుతోందన్నారు. కేంద్రం పూర్తి సామర్ధ్యం మేరకు ఏపికి సాయం చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సాకుగా చూపిి రాజధానిలో అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానులపై బిల్లు తీసుకువచ్చే ప్రసక్తి లేదని జీవీఎల్ స్పష్టం చేశారు.


Share

Related posts

Bigg Boss 5 Telugu: సన్నీ ఫ్రెండ్ అయినా గాని.. నా సపోర్ట్ మాత్రం ఆ కంటెస్టెంట్ కే లోబో వైరల్ కామెంట్స్..!!

sekhar

50 దాటినవారు ఈ జాగ్రత్తలు తీసుకోవలిసిందే!!

Kumar

మీ వృద్దాప్యం సంతోషంగా గడవడానికి ఇలా చేయండి!!

Kumar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar