బుల్లితెర.. ఇప్పుడు ఎంతో వినోదాన్ని పంచే భలే మంచి తెర అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు సిరియల్స్, పాత సినిమాలకే పరిమితమైన బుల్లితెర ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి అన్నీ రకాల వినోదాలను కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడ వివాదాలు సహజమే.. కుళ్లు జోకులు సహజమే.. ఇలాంటి విషయాల్లో కొన్ని జంటలను ప్రత్యేకంగా చూపిస్తున్నాయి కొన్ని ఛానెళ్లు.
అయితే ఆ జంటల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది రష్మీ-సుధీర్, హైపర్ ఆది- వర్షిణిల జోడిలు. వీళ్లు బుల్లి తెర మీద చేసే హడావిడి అంతా ఇంతా కాదు.వీరిగురుంచి ఒక వీడియో యూట్యూబ్ లోకి వస్తే.. అది ట్రెండింగ్ లో ఉండాల్సిందే.. అవును మరి కెమెరా ముందుకు వస్తే.. ఈ జంటలు పండించే రొమాన్స్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఏందిరా సామీ.. ఈ లొల్లి అని తలలు బాదుకునే వారు కూడా ఉన్నారు.
అయితే ఇలాంటి హాట్ జోడిలను తన ప్రోగ్రాంకు పిలిచి సరదాగ మాట్లాడుతుంటారు ఆలీ. తను చేసే ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం తో అందరిని అలరిస్తుంటారు. ఈ ప్రోగ్రాంలో వచ్చిన జోడీని మాటల్లో పెట్టి వారి వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ మధ్య వర్షిణి- ఆది జోడీని కూడా తన షోకు పిలిచారు ఆలీ. అయితే ఇక్కడ ఈ జోడీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే.. ఈ షోలో భాగంగా ఆలీ ఆది గురుంచి చెప్పమని వర్షిణిని అడిగారు.
వర్షిణి ఆది గురుంచి చెప్తు ఆదితో తన పరిచయం, స్నేహం గురించి చెప్పుకుంటూ వచ్చింది. అలాగే ఆది మంచి, చెడు అలవాట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. ఆదికి మందు , సిగిరెట్ తాగడం లాంటి చెడు అలవాట్లు లేవని చెప్పింది కానీ అమ్మాయిలను గెలికే అలవాటు మాత్రం ఉందని చెప్పింది. ఇక తను చేసే పనులను చెప్తూ.. తన మేకప్ గర్ల్ కనిపిస్తే ఆది ఆమెను గెలకడం స్టార్ట్ చేస్తాడని తెలిపింది. ఆమె వస్తే తన రూంలోకి వచ్చి ఆమెను ఫ్లర్ట్ చేస్తుంటాడని తెలిపింది.దాంతో హైపర్ ఆది ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అలాగే సెట్స్‌లో ఏ మాత్రం ఖాళీ దొరికినా మొబైల్ ఫోన్ లోనే మునిగిపోతుంటాడని వర్షిణి తెలిపింది.ఆదికి ఎవరో ఒకరితో రిలేషన్ ఉండే ఉంటుందని అనుమానాన్ని వ్యక్తం చేసింది.వర్షిణి మాటలు సరదాగా తీసుకున్న హైపర్ ఆది, తిరిగి ఆమె పైనే రివర్స్ పంచులేశాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!