Beauty Tips : చాలామంది చర్మం ముడతలు పడుతుందని బాధపడుతుంటారు.. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం వయసు పెరిగే కొద్దీ నుదిటి మీద సన్నని గీతలు మొదలవుతాయి అక్కడినుంచి ముడతలు వస్తాయి.. కొంచెం ఓపికగా కింది వాటిని పాటిస్తే చక్కటి కాంతివంతమైన చర్మాన్ని తిరిగి పొందవచ్చు..

* గుడ్డులోని తెల్లసొన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా సంరక్షిస్తుంది.. గుడ్డులోని తెల్లసొన లో కొద్దిగా పాల మీగడ, రెండు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం మీద ముడతలు తగ్గి, మృదువుగా మారుతుంది.
*అరటిపండు ముక్కలు, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, తేనే, పెరుగు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇది కూడా చర్మం మీద ముడతలు తగ్గిస్తుంది.
* బంగాళదుంప ముక్కలు గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పలచటి క్లాత్ లో వేసి రసాన్ని పిండాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప రసం లో దూది ముంచి దానితో ముఖానికి, మెడ భాగానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి.దీంతో వయసు పెరగడంతో తడితే చర్మంలోని సాగిపోయే గుణాన్ని నివారిస్తుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.
*కొబ్బరి పాలల్లో దూదిని ముంచి దానితో ముఖాన్ని, మెడను బాగా రుద్దుకొని పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పట్టులా మారుతుంది.
కొబ్బరిపాలు చర్మానికి రాసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది . ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ సప్లిమెంట్ గుణాలు చర్మాన్ని కాలుష్య రహితంగా చేస్తాయి. చర్మ రంధ్రాలు లోని మురికిని పోగొడతాయి.
*చింతపండు, పాలు ఈ రెండింటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వేసుకుంటే చర్మం మీద ఉన్న నల్ల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి.
* పసుపు కొమ్ములను దోరగా వేయించి వాటిని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఈ పసుపు పొడి తో ప్రతినిత్యం నలుగు పెట్టుకుంటే శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గటంతో పాటు మిలమిలా మెరిసిపోయే చర్మ సౌందర్య మీ సొంతం అవుతుంది..
*ఈ సమస్య పెరగకుండా ఉండాలంటే ముందు సమతులాహారం తీసుకోవాలి. ఈ రోజు మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీళ్లు తాగాలి. ఎండలోకి ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. రోజుకు ఎనిమిది గంటల నిద్ర పోవాలి.