న్యూస్ హెల్త్

మీరు ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా?? అయితే ఇది మీకోసమే!!

మీరు ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా?? అయితే ఇది మీకోసమే!!
Share

ఎడమ వైపు తిరిగి నిద్ర పోవడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుందాం..రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్ర పోకూడదు.. కనీసం 2 గంటలు గడచిన  తర్వాత నిద్రపోవడం మంచిది. తిన్న వెంటనే నిద్ర పోవడం వలన షుగరు  , గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. ఎడమ ప్రక్కకు తిరిగి, ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకోవాలి. బాగా అలసి పోయినప్పుడు  ఎడమ వైపున తిరిగి పడుకోవడం  వలన అలసట తగ్గి  రోజంతా ఉత్సాహం గా పనులు చేసుకోగలుగుతాము.

మీరు ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా?? అయితే ఇది మీకోసమే!!

ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన  గురక తగ్గుతుంది.
గర్బిణీ స్త్రీలు ఎడమవైపు తిరిగి  పడుకోవడం వలన కు రక్త ప్రసరణ బాగా జరగడం తో పాటు గర్బాశయంకు, కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ ఉంటుంది . వీపు ,వెన్నునొప్పుల నుండి ఉపశమనంకలుగుతుంది.
భోజనం తర్వాత జీర్ణక్రియ సక్రమం గా జరిగేలా చేస్తుంది .
వీపు , మెడ నొప్పులున్నవారికి  ఉపశమనం కలుగుతుంది . కాలేయం మరియు మూత్ర పిండాలు బాగా  పని చేస్తాయి .
గుండె లోని మంటనుతగ్గించడం తో పాటు గుండెకు  శ్రమ తగ్గి చక్కగా పని చేస్తుంది .
రాత్రి  ఎడమ వైపు  తిరిగి పడుకోవడం  వలన ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .దానితో పాటు మెదడు చురుకుగా పని చేస్తుంది. అల్జీమర్ ను  కూడా  తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరు వారి కి అలవాటు ఉన్నపద్ధతిలో నిద్రపోతుంటారు. ఆ పద్ధతిని మార్చుకోవాలంటే కొంచెం కష్టమే..  కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును.
అలాగే పిల్లలకి   చిన్నప్పటి నుండే ఈ అలవాటు  చేయడం వలన వారికీ మంచి ఆరోగ్యం ఇచ్చినవారమవుతాం.


Share

Related posts

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిననల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అను నేను …… !! 

sekhar

మీరు మటన్ ప్రియులైతే  ఇది తెలుసుకొండి…  ఇంక ఎప్పటికి వదిలి పెట్టారు  !!

Kumar

Megastar : మెగాస్టార్..పవర్ స్టార్ ..మెగా పవర్ స్టార్.. ఇది కదా ఇన్నేళ్ళు అందరు మిస్సయింది ..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar