Smoking :పొగతాగడం Smoking ప్రాణానికి హానికరం అని ఎవరు ఎన్నిసారుల్ ఎన్ని విధాలా చెప్పిన సిగరెట్స్ తాగే అలవాటు మాత్రం మానుకోలేరు..భార్య,లేదా తల్లి ఏమి చెప్పినా వినే వ్యక్తి ..సిగరెట్ విషయంలో మాత్రం ఎవరి మాట పట్టించుకోడు..అంత బానిసలుగా మారి జబ్బులను తెచ్చుకుంటున్నా వారు చాలామంది ఉన్నారు. క్యాన్సర్ వంటి రోగాల తో ఎంతో మంది చనిపోతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిక ప్యాకేట్స్ మీద వెయించిన ప్రయోజనం లేకుండా పోయింది.
ఒక ఆకు రసం తాగితే సిగరెట్ కాల్చాలన్న కోరిక తగ్గిపోతుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే క్యాబేజీ రసం…. ఇది తాగినా లేకా ఆకులు నమిలిన వారు సిగరెట్లు మర్చిపోతారట. క్యాబేజీ అంటే పోషకాల గని అని కూడా అంటారు. క్యాబేజీలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ని తగ్గించడం లో కూడా బాగా పనిచేస్తుంది. శరీరానికి అవసరమైన “ఫ్లేవనాయిడ్స్” క్యాబేజీ నుండి బాగా అందడం వలన “పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్” ప్రభావాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు తెలియచేస్తున్నారు.
అలాగే శరీరంలో ఎక్కడైనా వాపులు ఉంటే అక్కడ రాత్రి పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులు పెడితే పొద్దున్నకె ఆ వాపులు తగ్గుతాయి. పిల్లలు పాలు తాగడం వలన తల్లులు స్తనాల నిపుల్స్ లో నొప్పి , మంట వస్తుంటుంది. అలాంటప్పుడు క్యాబేజీ ఆకులు వాటి మీద ఉంచితే ఉపశమనం కలుగుతుంది. క్యాబేజీ రసంతగలేని వారు, ఆకులు నమలలేని వారు.. అందులో కొంత చక్కెర కలుపుకుని తాగవచ్చట. ఈ విధం గా రెండు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఆ తర్వాత వాళ్లు సిగరెట్ అన్న పదమే గుర్తుకు రాదట. ఇక సిగరెట్ మానని వాళ్ళకి ఈ క్యాబేజీ చిట్కాతో మాన్పించే లా చూడండి.