బిగ్ బాస్ తెలుగు చాలా మంది చిన్న సైజు సెలబ్రెటీలను బడా స్టార్స్ ను చేసి బయటకు పంపించింది. తర్వాత కొంతమంది తమ టాలెంటుతో సినిమా ఇండస్ట్రీలో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. అలాగే ఈ సీజన్ లో కూడా అలాంటి కొంతమందిని బిగ్ బాస్ బయటకు పంపింది. వారిలో ఒకరు కమెడియన్ అవినాష్. ముందుగానే జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న అవినాష్ ఇంటిలోకి ప్రవేశించి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు.
ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ నటుడు కావాలన్న కోరికతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అవినాష్. ప్రస్తుతం అతను వరుస ఇంటర్వ్యూల తో బిజీగా మారుతున్నాడు. అందరినీ నవ్వించే అవినాష్ గతంలో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోడ్డుపైన ఐస్ క్రీములు కూడా అమ్మాడు. ఒక ఆఫీస్ బాయ్ గా పనిచేశాడు. పార్ట్ టైం జాబ్ ఏది చేసినా కూడా తన అవసరాలకు సరిపోయే లాగా చిన్న చిన్న పనులు చేస్తూ సినిమా అవకాశాలు మీద దృష్టి పెట్టాడు.
ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నాడు.జబర్దస్త్ లో నుండి బయటికి వచ్చాక అవినాష్ ఇప్పుడు కొత్త పని వెతుక్కోవాల్సి వచ్చింది. అయితే బిగ్బాస్ ఇంటి నుండి లాభదాయకంగా బయటపడిన అవినాష్ ను దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ పైన కలిసినప్పుడు నీ టైమింగ్ బాగుంది అని చెప్పారట. ఒకసారి ఆఫీసుకు వచ్చి కలవమని కూడా చెప్పారట. ఆయన నుండి మంచి ఆఫర్ వస్తుందని ఆశిస్తున్నట్లు అవినాష్ వివరణ ఇచ్చాడు.