బిగ్ బాస్ 4: అరియానా ఏడ్చిన తర్వాత అవినాష్ బట్టలు విసిరేసింది..!!

బిగ్ బాస్ ఇంటిలో మగవారితో సమానంగా ఆడవారిలో గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్… అరియనా. ఎలాంటి టాస్క్ ఇచ్చిన… ఎలాంటి పరిస్థితిలో ఇతరులతో వాగ్వాదం విషయంలో పాయింట్ టూ పాయింట్ మాట్లాడుతూ ఏదో రీతిలో రాణిస్తూ తాజాగా కెప్టెన్ అయింది. ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని పిలవబడే వారి చేత కూడా శభాష్ అనిపించుకున్న ఈ రీతిలో ముక్కుసూటి ఆట ఆడుతూ జీవితంలో ఏ విధమైన కష్టాలు ఎదుర్కొని పైకి వస్తుందో.. అదే రీతిలో బిగ్ బాస్ హౌస్ లో కూడా అరియనా ఫైట్ చేస్తుందని బయట జనాలు అంటున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఎపిసోడ్లో బిగ్ బాస్ అరియనా కి తాను ఆడుకునే బొమ్మ తిరిగి ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో ఇల్లు గుర్తుకు రావడంతో ఎమోషనల్ అయి ఆరియనా కన్నీళ్లు పెట్టుకోవడంతో… వెంటనే అవినాష్ వచ్చి ఓదార్చడం జరిగింది. ఇదిలా ఉండగా ఇంటిలో ఎవరైనా పగటిపూట నిద్ర పోతే బాధ్యత తీసుకోవాల్సిందిగా కెప్టెన్ దే అంటూ బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది.

 

ఈ క్రమంలో ఇంటిలో మధ్యాహ్నం అవినాష్ నిద్ర పోయేందుకు కెప్టెన్ అరియానా ముందే ప్రయత్నించాడు. బెడ్ వెనుక సందులో దూరి నిద్ర పోవడానికి చేసిన ప్రయత్నాలను అరియానా అడ్డుకొన్నది. అయితే బెడ్ వెనుక దిండు పడ్డది అందుకే తీయడానికి వెళ్తున్నాను అంటూ కవరింగ్ ఇచ్చాడు. అవినాష్ కవరింగ్ తట్టుకోలేని అరియానా చేతిలో ఉన్న బాటిల్‌తో విసిరి కొట్టింది. అంతేకాకుండా అవినాష్ బట్టలు కూడా  అరియానా విసిరి వేయటం తో… ఇంటిలో సరదా సరదా వాతావరణం నెలకొంది.