తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ ఫోర్ టిఆర్పి రేటింగ్ లో దుమ్ము దులుపుతుంది. గత మూడు సీజన్లకు భిన్నంగా ప్రస్తుతం రన్ అవుతున్న షోకి మంచి ఆదరణ ఆడియన్స్ నుండి లభిస్తుంది. షో లో రకరకాల టాస్క్ లతో పాటు వైల్డ్ కార్డు రూపములో ఎంట్రీలు షో పై చూస్తున్న ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్త పడటం జరిగింది.
ఒకపక్క ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నా గాని బిగ్ బాస్ షో కి ఎక్కడ ఆదరణ తగ్గిపోకుండా షో నిర్వాహకులు చూసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల అనారోగ్యం కారణంగా షో నుండి బయటకు వచ్చిన నోయల్… పలు వెబ్ మీడియా ఛానల్స్ కి ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ గురించి ప్రస్తావన వచ్చినా క్రమములో లేడీస్ లో అయితే పోటీ ఆరియానా హారిక మధ్య ఉన్నా గాని ఎక్కువగా గెలిచేది మాత్రం హారిక అని తేల్చిచెప్పాడు నోయల్. కారణం చూస్తే గేమ్ పరంగా ఆరియానా పాయింట్ టు పాయింట్ మాట్లాడినా గాని ఎంటర్టైన్మెంట్ పరంగా మిగతా టాస్క్ లలో హారిక అంత కాదని పేర్కొన్నాడు. హారిక ఆల్ రౌండర్ అని కాబట్టి ఆమె లేడీ కంటెస్టెంట్ లలో ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయని నోయల్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.