బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు బిగ్ బాస్. సీక్రెట్ రూమ్ లో అఖిల్ ని పెట్టి తర్వాత బయటకు తీసుకొచ్చి ఈ వారం నామినేషన్ ప్రక్రియ లో హౌస్ లో భారీ స్థాయిలో గొడవలు జరిగేలా షో పై ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. నామినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు టాస్క్ లలో బిగ్ బాస్ గత సీజన్ లను రిపీట్ చేసే తరహాలో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వారంలో కూడా గత సీజన్లో మాదిరిగా ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చే రీతిలో ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంటి లోకి ప్రవేశించే ఎపిసోడ్ ఉంటుందని లీకు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత మూడు సీజన్లలో ఈ రకమైన ఎపిసోడ్ కొనసాగింది. తాజాగా మళ్లీ అదే తరహాలో బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు ఈ వారంలోనే ఆ ఎపిసోడ్ వున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఫ్యామిలీ ఎమోషనల్ ఎపిసోడ్ లో పాట వచ్చే సమయంలో ఇంటి సభ్యులు డాన్సులు వేస్తూ ఒక్కసారిగా పాట ఆగిపోతే ఒక్కొక్క కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ ఒక్కో సాంగ్ కి హౌస్ లో ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇంటిలో ఎనిమిది మంది సభ్యులు మిగిలి ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంటి సభ్యులు వారి కుటుంబ సభ్యులను డైరెక్టుగా కలవకుండా కన్ఫెక్షన్ రూమ్ నుండి మాత్రమే చూసుకునేది అనే టాక్ వస్తోంది. కరోనా కారణంగా ఇంటి సభ్యులు హౌస్ లోకి వెళ్లకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఫ్యామిలీ ఎమోషనల్ ఎపిసోడ్ ఈ రీతిగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.