బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఫుల్ ఎంటర్ టైన్ చేసే క్యాండిడేట్ జబర్దస్త్ అవినాష్. వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ గేమ్ పరంగా టఫ్ ఫైట్ ఇస్తూ హౌస్ లో ఇతరులకు మంచి పోటీ ఇస్తున్నారు. వైల్డ్ కార్డు రూపంలో ముగ్గురు ఎంట్రీ ఇవ్వగా ఈ సీజన్లో ఒక్క అవినాష్ మాత్రమే మిగిలారు. ఇంటిలో ఉన్న వాతావరణం బట్టి చూస్తే అవినాష్ టాప్ ఫైవ్ లో ఉంటాడు అని చాలామంది సోషల్ మీడియాలో అదేవిధంగా బయట చెప్పుకుంటున్నారు.
ముఖ్యంగా వీకెండ్ డేస్ లో అందరికంటే ఎక్కువగా అవినాష్ ఎంటర్టైన్ చేస్తున్నారని, ఒక్క ఎలిమినేషన్ సమయంలో తప్ప మిగతా రోజులలో అవినాష్ హౌస్ లో తన కామెడీ హ్యూమర్ తో న్యాయం చేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఏవిక్షన్ కారణంగా సేవ్ అవ్వటం నిజంగా చాలా అదృష్టం అని కరెక్ట్ టైంలో అదిరిపోయే ఛాన్స్ అవినాష్ కొట్టేశారు అని బయట జనాలు అంటున్నారు.
అంతేకాకుండా ఈ వారంలో జరగబోయే కెప్టెన్సీ టాస్క్ లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్లు కూడా టాప్ ఫైవ్ లో ఉండటం గ్యారెంటీ అనే టాక్ కూడా బయట వస్తుంది. ఇదిలా ఉండగా ఇంటి నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అఖిల్, అరీయనా పేర్లు వస్తున్నాయి. అదే టైంలో ఈ వారం ఎక్కువగా ఓటింగ్ పరంగా మోనాల్ అందరికంటే ముందు ఉన్నట్లు బయట జనాలు చెబుతున్నారు. గత కొన్ని రోజుల నుండి మోనాల్ ఇంటిలో వ్యవహరిస్తున్న తీరు ఆమె గ్రాఫ్ ని ఒక్కసారిగా పెంచేసినట్లు చెబుతున్నారు. హారిక కెప్టెన్ అయ్యే టాస్క్ లో అదేవిధంగా ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ టాస్క్ లో సరైన పాయింట్లతో మోనాల్ గేమ్ చాలా చక్కగా ఆడిందని పేర్కొంటున్నారు.