బిగ్ బాస్ సీజన్ త్రీ, అదేవిధంగా సీజన్ ఫోర్ కి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దూసుకుపోతున్నారు. ఆరు పదుల వయసులో కూడా అందం లో ఏమాత్రం కుర్ర వాళ్లకు తీసిపోకుండా సీనియర్లలో ఇప్పటికి ఇండస్ట్రీలో ప్రేమ కథా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని విధంగా చేతిలో అనేక సినిమాలు ప్రస్తుతం నాగార్జున ఖాతా లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఒకపక్క వెండితెరపై దూసుకుపోతున్న నాగార్జున టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో లో హోస్ట్ గా కూడా రాణిస్తూ అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో కి సంబంధించి ప్రతి ఎపిసోడ్ విషయాలు ముందే లీక్ అవ్వటం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ నుండి ఇదే జరుగుతుంది. అసలు హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదాని గురించి ముందే క్లారిటీ రావటంతో షోపై పెద్దగా ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండటం లేదు.
అయితే ఎన్నో సార్లు ఇదే జరుగుతున్న గాని షో నిర్వాహకులు అజాగ్రత్తగా వ్యవహరించడంపై తాజాగా నాగార్జున వారిపై సీరియస్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సీజన్ చివరికి వచ్చినా గానీ ఈ లీక్ బెడద ఇంకా పట్టుకుని ఉండటం తో నాగార్జున చాలా కోపంగా ఉన్నారట. ఇంకా ఇదే సీన్ రిపీట్ అయితే రాబోయే రోజుల్లో హోస్ట్ గా కూడా చేయను అంటూ షో నిర్వాహకులకు నాగార్జున కరాఖండిగా చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.