Bigg Boss: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో… ప్రారంభంలో ఎంటర్టైన్మెంట్ ఈ విషయంలో లోబో(Lobo) టాప్ అని ఇంటి సభ్యులు మాత్రమే కాక..హోస్ట్ నాగార్జున కూడా చెప్పుకు రావడం జరిగింది. అయితే ఆ తర్వాత లోబో ఇంటి నుండి వెళ్ళిపోయాక ఆ రీతిగా… ఎంటర్టైన్మెంట్ కొదువా తీరుస్తున్న కంటెస్టెంట్ సన్నీ(Sunny) అని నాగార్జున(Nagarjuna) మొన్న పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే. మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.
పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో ఉన్న ఆరుగురు సభ్యుల చేత..బిగ్ బాస్(Bigg Boss) తన దైన శైలిలో ఎంటర్టైన్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో క్యారెక్టర్ ఎటువంటిదైనా గాని… సన్నీ మరోసారి ది బెస్ట్ కామెడీ హౌస్ లో పూయిస్తున్నడు. ముఖ్యంగా పింకీ క్యారెక్టర్ వేసి సన్నీ చేసిన మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించిన కామెడీకి బయట మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎటువంటి క్యారెక్టర్ లోకి అయినా ఎంటర్టైన్మెంట్ చేయడానికి… ఇట్టే రంగంలోకి దిగి పోతున్నాడు సన్నీ.
గ్యారెంటీగా సన్నీకి టైటిల్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయట జనాలు అంటున్నారు. అప్పడం రీమేక్ గొడవ టాస్క్ లో… షణ్ముఖ్ క్యారెక్టర్ కి సంబంధించి..అతి చేయడం కొద్దిగా మైనస్ అయింది పింకీ క్యారెక్టర్ లో మాత్రం.. సన్నీ మరోసారి ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది హౌస్ అని రుజువు చేసుకున్నాడని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు మరి కొద్ది గంటల్లో జరగబోయే ఎపిసోడ్ లో హమీద వేషం వెయాటం జరిగింది. ఎటువంటి నామోషీ లేకుండా సన్నీ.. హౌస్ లో నవ్వులు పూయించడానికి చేస్తున్న పెర్ఫామెన్స్ కి బయట ఆడియోన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.