Birthday: పుట్టిన రోజు Birthday జరుపుకుంటే క్యాండిల్స్ ఊదడం, కేక్ కట్ చేయడం మన సంప్రదాయం అస్సలు కానే కాదు . మరిఈ సంప్రదాయం ఎలా మొదలై వ్యాప్తి చెందింది ? అసలు పుట్టిన రోజులకు కేక్ ఎందుకు కట్ చేయాలి ? అంటే.. మాత్రం ఎవ్వరికి ఈ విషయం మీద పెద్దగా అవగాహన ఉండదు. ఈ పద్ధతి ఎలా వాడుక లోకి వచ్చిందో ఆవివరాలు తెలుసుకుందాం.
పుట్టినరోజులకు కొవ్వొత్తులు ఊది, ఆర్పీ కేక్ కొయ్యడం అన్న సంప్రదాయం ఇప్పటిది కాదు. 1808వ సంవత్సరం లోఈ పద్దతి ప్రారంభమైనట్టుగా చెబుతారు. జర్మనీ లో అప్పట్లో కిండర్ఫెస్ట్ పేరుతో కేవలం పిల్లలకు మాత్రమే బర్త్ డే వేడుకలను చేసేవారట. ఆ సమయం లో వారు ప్రత్యేకం గాపుట్టిన రోజు కేకులను తయారు చేసి దానిపై పిల్లల వయస్సును బట్టి క్యాండిల్స్ పెట్టి వాటిని ఊదించి, ఆ తరువాత కేక్ కట్ చేయించేవారట. ఆ తరువాత ఇది నెమ్మదిగా ఇతర దేశాలకూ వ్యాపించింది. ప్రస్తుతం మనం కూడా అదే ఫాలో అవుతున్నాం.
అయితే జర్మన్లే కాదు, గ్రీకులు కూడా ఒకప్పుడు ఇలాంటి సంప్రదాయమే పాటించేవారనితెలుస్తుంది . కానీ వారు కొవ్వొత్తులను ఊదడానికి బదులు గా బాగా వెలుగు వచ్చేలా వెలిగించేవారట. ఇక కొవ్వొత్తులు అలంకరించిన ఆ కేకును ముందుగా ఆర్టెమిస్ టెంపుల్లో పెట్టి ఆ తరువాత పుట్టిన రోజుల ను జరుపుకునేవారట. ఇక కొంత మంది అయితే.. కేకు పైకొవ్వొత్తును ఉంచి వాటిని ఊదితే అప్పుడు వచ్చే పొగతో దేవున్ని ప్రార్థించినట్లు అవుతుందని నమ్మేవారట.
కేకులపై కొవ్వొత్తులు ఉంచడం అంటే.. వాటి నుంచి వచ్చే వెలుగు మన జీవితం లో నిండుతుందని జర్మన్లు నమ్మకమట. ఇక కేకు పై ఉన్నకొవ్వొత్తులను అన్నింటినీ ఒకేసారి ఊదితే కోరిన కోరికలు నెరవేరుతాయని, దేవుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మేవారు కూడా ఉన్నారు. అదేవిధంగా మనం కట్ చేసే చాల మెత్తని మృదువైన కేకులా మన జీవితం కూడా సాఫీ గా సాగాలని కొందరు నమ్ముతారట . ఇవన్నీ బర్త్ డేకు కేక్ ను కట్ చేయడం వెనుక దాగి ఉన్న ఆసక్తికర అంశాలు.