బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేత ఎవరో బుల్లితెర ప్రేక్షకులందరికీ రేపు తెలిసిపోతుంది ఇక దానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. షో మొదలైనప్పటి నుండి అనేక రకాల లీకులు వస్తున్న విషయం తెలిసిందే. నామినేషన్స్ ఎలిమినేషన్ తో సహా అన్ని కీలక సమాచారాలు మొదటి నుండి బయటకు వస్తున్నాయి.
ఇక ఇదే క్రమంలో ఫైనల్స్ కి ఈ సారి స్టేజీపైన చీఫ్ గెస్ట్ ఎవరు అన్న విషయం కూడా ముందే తెలిసిపోయింది. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ టైటిల్ విజేత కు ప్రైజ్ మనీ ఇచ్చేందుకు వస్తున్నారని అంటున్నారు. ఇక అంతే కాకుండా గ్రాండ్ ఫినాలే రోజున నాగచైతన్య, సాయి పల్లవి, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హోస్ట్ అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’ త్వరలోనే విడుదల కాబోతుంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కోసం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేదికగా చేసుకున్నట్లు సమాచారం.
ఇక అంతే కాకుండా మధ్యలో వినోదం కోసం పలువురితో వినోద కార్యక్రమాలను షూట్ చేస్తున్నారు. టిక్ టాక్ సెలబ్రిటీలు, పలువురు సినీ ప్రముఖులు, కొరియోగ్రాఫర్స్, అందమైన యాంకర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మొత్తానికి రేపు తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆదివారం కన్నుల విందు కాబోతోంది అన్నది ఖాయం.