Dhee 13 : ఢీ 13 Dhee 13 షో గురించి తెలుసు కదా. తెలుగులో వచ్చే డ్యాన్స్ షోలలో నెంబర్ వన్ ఢీ షో. ఇది ఇప్పటిది కాదు. చాలా సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుస్తున్న షో ఇది. అందుకే ఈ షోకు అంత క్రేజ్.
అయితే.. ఢీ 13 షోలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. డ్యాన్స్ తో పాటు ఈ షోలో కామెడీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. యాంకర్ ప్రదీప్ టైమింగ్ కామెడీతో పాటు జడ్జి శేఖర్ మాస్టర్ చేసే కామెడీ.. దానికి తోడు జబర్దస్త్ టాప్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. ఇద్దరూ కలిసి చేసే కామెడీ మామూలుగా ఉండదు. అందుకే.. ఈ షోకు అంత పాపులారిటీ.

అయితే.. ఈ షోలో వచ్చిన చిక్కు ఏంటంటే.. కామెడీ కోసం కేవలం ఒకే సైడ్ ను ఎంచుకోవడం. అంటే.. ప్రదీప్.. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. ఇద్దరిని ఫోకస్ చేసి.. వాళ్లను ఆటపట్టిస్తూ కామెడీ చేస్తుంటాడు. అలా కామెడీని బయటికి తీస్తుంటారు. అలాగే.. శేఖర్ మాస్టర్ కూడా సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిలను ఓ రేంజ్ లో ఆడుకుంటాడు.
Dhee 13 : తాజా ప్రోమోలో సుధీర్, ఆదిని ఓ ఆట ఆడుకున్న ప్రదీప్?
అయితే.. తాజా ప్రోమో చూస్తే.. సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిని యాంకర్ ప్రదీప్ ఎలా ఆడుకున్నాడో తెలుస్తుంది. హైపర్ ఆది, సుధీర్ ను మోకాళ్ల మీద కూర్చోమంటూ.. ఆ తర్వాత యోగాసనాలు వేయాలంటూ.. ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో అన్నయ్యకు పెళ్లంటా.. అంటూ సాంగ్ ను కంటిన్యూగా ప్లే చేయడం.. శేఖర్ మాస్టర్ కూడా సుధీర్ ను ఆటపట్టించడం.. ఇవన్నీ చూస్తుంటే.. ప్రతి ఎపిసోడ్ లో కేవలం వీళ్లిద్దరినే ఆటపట్టించి కామెడీని లాగుతున్నట్టుగా అర్థమవుతోంది.
నెటిజన్లు కూడా ఈ విషయంపై కొంచెం ఆగ్రహంగానే ఉన్నారు. ఎప్పుడూ వీళ్లనే టార్గెట్ చేస్తూ కామెడీని జనరేట్ చేయాలా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇదంతా జస్ట్ ఫర్ పన్ కోసమే కాబట్టి.. పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా.. కామెడీని కామెడీగానే తీసుకుంటే బెటర్. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.