రాజమౌళి ఈగను ‘రియల్’గా చూశారా ?

ఒకటి నిన్ను వదల.. రెండు నిన్నువదల.. మూడు నిన్ను ఖచ్చితంగా వదిలేది లేదంటూ ఈగ చేసే ప్రయత్నాలను చూస్తే వామ్మో ఈగలు కూడా పగలు పగపడతాయా అని అనుకునే ఉంటారు. అది నిజం కాకపోయినా అ సినిమా చూసేవాళ్లను ఖచ్చితంగా ఈగలు రివేంజలను తీర్చుకుంటాయా? అనే సందేహం కలిగించారు డైరెక్టర్ రాజమౌళి. తన క్రియేటివిటీ ఆలోచనతో ఈగతో కూడా సినిమా తీసేసారు. డిఫరెంట్ తాట్ తో తీసిన ఈ సినిమా బాగానే ఆడిందని చెప్పొచ్చు.

అయితే ఈ ఈగ సినిమా ఎందుకు చెబుతున్నారని అనుకోవచ్చు. కాని నిజంగా ఈగ సినిమాలో లాగే ఓ ఈగ ఓ వ్యక్తిని దారుణంగా విసిగించేసిందండి.. నిజం ఇది మీరు నమ్మాల్సిందే.. మరి లేటెందుకు ఈ ఆర్టికల్ ను చదివేయండి మరి..ఈ ఫన్నీ సన్నివేశం ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. ఫన్ని అనడం కరెక్ట్ కాదేమో.. కాని ఓ వ్యక్తికి మాత్రం విసిగించి తన ప్రాణాలు తీసేంత పనిచేసిందండోయ్..

ఫ్రాన్స్ లో ఓ ఇంట్లో వృద్దుడు(80) నివసించేవాడు. రోజూలాగానే భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో అనుకోకుండా ఒక ఈగ అతని ముందు ప్రత్యేక్షమైంది. అది తిన్నగా ఉంటుందా అంటే అదీ లేదు. దాంతో ఆ వ్యక్తి దాన్ని కొట్టాడు. అది పోయింది అని అనుకున్నాడు. కాని అది అతని సహనానికి పరీక్ష పెట్టినట్టుంది. మళ్లీ వచ్చింది. మళ్లీ కొట్టాడు. ఆహా అది పోతేనా మళ్లీ వచ్చింది. దాంతో ఆ వృద్దుడి కి చిరాకు, విసుగు, కోపం తారా స్థాయికి చేరాయి. కోపంతో తింటున్న పళ్లెంను పక్కన పెట్టేసాడు. దాని పని పడదామని…

ఎలక్ట్రిక్ బ్యాటును పట్టుకుని దాన్ని చంపడానికి ప్రయత్నించాడు. దానితో అది భయపడి కిచెన్ లోకి వెళ్లింది. వృద్దుడు కూడా దాని వెంటే వెళ్లాడు. అప్పటికే కిచెన్ లో సిలిండర్ లీక్ అవుతున్నది. ఇంకేముంది ఎలక్ట్రిక్ బ్యాట్ నుంచి వచ్చిన నిప్పు రవ్వల మూలంగా సిలిండర్ ఒక్క సారిగా పేలిపోయింది. దాంతో కిచెన్ పైకప్పు ఎగిరిపోయింది. ఇంత తంతు జరిగినా ఆ ఈగ చచ్చిందా అంటే ఏమో తెలియదని అంటున్నాడు ఆ వృద్దుడు. ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషం అని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. అమ్మో ఈగ కూడా ఇలా చేసిందని అనుకుంటున్నారు కదా.. ఏం చేస్తాం ఇది నిజంగానే జరిగింది మరి.