NewsOrbit
న్యూస్

టిఆర్ఎస్‌కు వివేక్ గుడ్‌బై

హైదరాబాదు, మార్చి 25: మాజీ పార్లమెంట్ సభ్యుడు జి వివేక్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేశారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని తనకు కేటాయించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన టిఆర్‌ఎస్ నేతలను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ద్రోహం కారణంగా తాను పోటికి దూరమయ్యానని వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక ప్లాన్ ప్రకారం పోటీ చేసే అవకాశం లేకుండా కెసిఆర్ చివరిక్షణంలో టికెట్ నిరాకరించారని వివేక్ అన్నారు. తన తండ్రి దివంగత జి వెంకటస్వామి (కాకా), తాను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామని చెప్పారు. తెలంగాణ మేలు కోసమే కెసిఆర్ ఆహ్వనిస్తే పార్టీలోకి వచ్చామని వివేక్ అన్నారు.

2014లో టిఆర్ఎస్‌కు ఇద్దరు ఎంపిలే ఉంటే తాను తోటి ఎంపిలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే తాను చేసిన ద్రోహమా అని వివేక్ ప్రశ్నించారు. తెలంగాణ సాధనలో కాకా చేసిన సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్‌పై విగ్రహం పెట్టారని అన్నారు. ఉద్యమంలో ఏ పాత్ర లేని వాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్‌‌లు ఇచ్చారని వివేక్ అన్నారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లే ఇప్పుడు పార్టీకి పెద్ద ముఖాలుగా ఉండటం బాధ కల్గిస్తోందని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వ పోకడలను ప్రజల మీద రుద్దుతున్నారని వివేక్ విమర్శించారు. ఈ విషయాలను ప్రజలు త్వరలో గుర్తిస్తారని వివేక్ అన్నారు. అభిమానులు, మద్దతుదారులు కోరుతున్నా సమయం తక్కువగా ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వివేక్ తెలిపారు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

Leave a Comment