రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

గుంటూరు,డిసెంబర్ 25: గుంటూరు జిల్లా జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద మంగళవారం వేకువజామున జరిగన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.జరిగింది. జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను, కారు ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న నలుగురు మృతిచెందారు. కారులో ఉన్న మరో నలుగురు, ట్రాక్టర్‌లో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. మృతులను గుంటూరు గోరంట్లకు చెందిన వారిగా గుర్తించారు.
మృతుల్లో తల్లీ కుమార్తెలు జయశ్రీ, అనసూయ, రమాదేవి, డ్రైవర్‌ ఫ్రాన్సిస్‌ ఉన్నారు.
కారులో ప్రయాణిస్తున్న వారంతా చిలకలూరిపేట మండలం యడవల్లిలో శీమంతం వేడుకకు  వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది