NewsOrbit
దైవం న్యూస్

Ganesh Nimajjanam: గణేష్ నిమజ్జనం పూజ, పీఠ కదిపే విధానం, గణేష్ నిమజ్జనం అప్పుడు చేయకూడనివి ఇవే..

Ganesh Nimajjanam: గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, వివిధ కూడళ్లలో, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో, అపార్ట్ మెంట్ లలో వివిధ రూపాల్లో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక నిమజ్జనాన్ని కొన్ని ప్రదేశాల్లో మూడు రోజులకు, అయిదు రోజులకు, ఏడు రోజులకు నిర్వహిస్తారు. చివరిగా తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత పదకొండవ రోజు మన దేశంలోని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఘనంగా నిమజ్జన వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం భాద్రపద మాసంలోని అనంత చతుర్ధశి రోజున వినాయక విగ్రహాలను సమీపంలోని నదులు, చెరువు లేదా సముద్రాల్లో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జనానికి ముందు చేసే పూజ, పీఠ కదిపే విధానం, గణేష్ నిమజ్జనం అప్పుడు చేయకూడని తప్పులు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉధ్వాసన పూజ ఇలా

వినాయక మండపంలో గణనాధుడిని కదిలించడానికి ముందు ఉధ్వాసన పూజ చేయాలి. యధాస్థానం ప్రవేశయామి ..పూజార్థం పునరాగమనాయచ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహానికి ఉధ్వాసన పలకాలి. దీని అర్ధం స్వామి.. నీ స్వస్థలానికి వెళ్లి .. మళ్లీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు అని అర్ధం.  పూలు, పండ్లు, కొత్త బట్టలు, మోదక లడ్డూలను బొజ్జ గణపయ్య ముందు ఉంచాలి. అనంతరం హారతి ఇచ్చి నైవేద్యాన్ని అందరికీ పంపిణీ చేయాలి. తదుపరి ఒక తెల్లని వస్త్రం (గుడ్డ) లో అయిదు రకాల పండ్లను, పువ్వులను, మోదకం, తమలపాకులతో పాటు ఇతర వస్తువులను కట్టి గణనాధుడి విగ్రహం వద్ద ఉంచాలి. పత్రిలోని అయిదు ఆకులను తీసుకుని వాటికి పసుపు రాసి దారంతో కంకణం చేసుకుని కుడి చేయికి కట్టుకోవాలి. ఆ తర్వాత రెండు చేతులతో నమస్కారం చేస్తూ స్వామి వారిని స్మరించుకోవాలి. నవరాత్రుల వేళ తాము ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని కోరుకోవాలి. అయిదు సార్లు లేదా తొమ్మిది సార్లు గుంజిళ్లు తీయాలి. మండపంలోని గణపతి విగ్రహాన్ని కదలించడానికి ముందు గణపతి బప్పా మోరియా..జే బోలో గణేష్ మహారాజ్ అనే నినాదాలు చేయాలి. అనంతరం నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తూ స్వామివారిని తరలించాలి. నిమజ్జనం చేసే సమయంలో ఈ మంత్రాలను పఠించాలి.

‘యంతు దేవగణః సర్వే పూజామాదయ మోమ్కీం

ఇష్టకామసమృద్దర్థం పునరపి పునరాగమనా చ ||”

‘గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానే పరమేశ్వర

మమ పూజా గ్రహీత్మేవం పునరాగమనాయ చ||”

Ganesh Nimajjanam

వినాయకుడి ఏదైనా నది, చెరువు, సముద్రం ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు ముందుగా గణనాధుడి విగ్రహానికి పూజారులు చెప్పిన పద్ధతిలో పూజ చేయాలి. వినాయకుడికి సంబంధించిన వస్తువులన్నింటినీ నీటిలో నిమజ్జనం చేయాలి. ఆ తర్వాత వినాయక విగ్రహాన్ని నెమ్మదిగా నీటిలోకి తీసుకువెళ్లి నిమజ్జనం చేయాలి. అనంతరం స్వామివారిని తలుచుకుంటూ నమస్కారం చేయాలి. వచ్చే ఏడాది కూడా తమ కాలనీకి, ఇంటికి రావాలని కోరుకోవాలి.

నిమజ్జనంలో చేయకూడనివి

గణనాధుడిని విగ్రహాన్ని నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయకుడికి సంబంధించిన వస్తువులు విసిరివేయకూడదు. వినాయకుడిని బొర్లా (వెనుక వైపు) నుండి నీటిలో ముంచకూడదు. కేవలం ముందు బాగం నుంచి మాత్రమే నీటిలో నిమజ్జనం చేయాలి. నీటిలో దిగే సమయంలో కింద విగ్రహాలను కాళ్లతో తొక్కకుండా జాగ్రత్త లు పాటించాలి.

YS Sharmila: కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల అల్టిమేటం..? .. విలీనం లేకపోతే 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ..

Related posts

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?