Guppedentha Manasu Feb 19 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతు వెళ్తుంది.రోజు రోజుకీ వసు-రిషిల మధ్య బంధం బలపడుతూ వస్తుంది.అయితే విరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి తెలియక గౌతమ్ అయోమయంలో ఉండిపోతాడు.ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే రిషి వసును ఇంట్లో దింపి వెళ్ళిపోతాడు.రిషికి గుడ్ నైట్ చెప్పి ఏదో ఆలోచనలో వస్తున్న వసుని చూసి…ఏంటో నవ్వుకుంటూ వస్తున్నావ్ అంటుంది జగతి. ఏం లేదు మేడం మా ఎండీ గారు ఓ చిక్కు లెక్క ఇచ్చారంటుంది.మరి నన్ను ఎమన్నా సాయం చేయమంటావా అంటే ఆ లెక్క అంత ఈజీ కాదులెండి అనేస్తుంది.
Mahashivaratri : మహాశివరాత్రి కి ఈ చిన్న పని చేయండి… అద్భుత ఫలితం కలుగుతుంది !!
Guppedentha Manasu Feb 19 Today Episode: వసుధార ఊహల్లో రిషి :
మరోవైపు ఇంటికెళుతూ వసుధార ఊహల్లో మునిగి తెలుతూ ఉంటాడు రిషి.వసుధారలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకుంటాడు. నేను ఎన్నిసార్లు లిఫ్ట్ ఇచ్చాననే లెక్క వేస్తుందా అనుకుంటాడు. ఎక్కడైనా రాసిపెట్టుకుని ఉంటుందా అనుకుంటాడు.అసలు నేను ఎన్నిసార్లు రెస్టారెంట్ కి వెళ్లి కాఫీ తాగానో ఎలా లెక్కెట్టాలి అనుకుంటాడు.సీన్ కట్ చేస్తే ఇంటి బయట వర్కౌట్స్ చేస్తున్న మహేంద్ర దగ్గరకు వచ్చిన గౌతమ్…నేను బావుంటానా, హీరోగా పనికొస్తానా అని అడుగుతాడు. పనికొస్తావ్ గౌతమ్ అంటాడు మహేంద్ర. మరి ఆ రిషి గాడు ఏంటి నన్ను తెలియకుండా తొక్కేస్తున్నాడు అంటాడు. ఏమైంది మళ్లీ ఏమైనా గొడవ పడ్డారా అంటే…గొడవ కాదు అంకుల్ ఆ రిష గాడు నన్ను అనేలోగా…రిషి ఎంట్రీ ఇస్తాడు. రిషిని చూసి గౌతమ్ మాట మార్చేయగా మహేంద్ర నవ్వుతాడు.నువ్వు నాకు నిజాలు చెప్పాలి కదా, నువ్వు మోసగాడివి, నాకు అబద్ధాలు చెప్పావ్ అని గౌతమ్ అంటే..ఏం మాట్లాడుతున్నావ్ రా అని రిషి అంటాడు. నేను మేడంని కలిశాను ఆమె నాకు మొత్తం చెప్పారు, నాకు అంతా తెలిసిపోయింది అంటాడు గౌతమ్.
Devatha Serial: నేనేమైనా నీ బిడ్డనా అని ఆదిత్యను ప్రశ్నించిన దేవి..!? ఆదిత్య సమాధానం ఏంటంటే.!?
గౌతమ్ కు అసలు విషయం చెప్పిన జగతి.. షాక్ లో రిషి :
మేడం దగ్గరకు వెళ్లావా, ఏం చెప్పారు అని రిషి షాక్ అవుతాడు.నిజాలు చెప్పారు అని రిప్లై ఇస్తాడు. చీటర్, ద్రోహి నాకు చెప్పాలి కదరా అని గౌతమ్ తన ధోరణిలో మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు. అడిగితే..షార్ట్ ఫిలింలో రోల్ ఇవ్వొద్దని వీడు డిసైడ్ అయ్యాడట అని క్లారిటీ ఇస్తాడు. నువ్వు షార్ట్ ఫిలిం గురించి మాట్లాడుతున్నావా అని రిషి అంటే…మరి నువ్వేమనుకున్నావ్ అంటాడు గౌతమ్.షార్ట్ ఫిల్మ్ లో ఒక ఛాన్స్ ఇవ్వొచ్చు కదా అని గౌతమ్ అడిగితే తర్వాత మాట్లాడుదాం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.ఇద్దర్నీ చూసి మహేంద్ర నవ్వుకుంటాడు.ఇంతలో రిషి కాలేజీ విషయాలు కాలేజీలో మాట్లాడుకుందాం అని రిషి మాట వినగానే, జగతి మేడం కూడా సేమ్ మాట అన్నారని చెబుతాడు. ఎంతైనా సేమ్ బ్లడ్ కదా అని తనలో తాను అనుకుని నవ్వుకుంటాడు మహేంద్ర.
షార్ట్ ఫిల్మ్ లో గౌతమ్ కు క్యారెక్టర్ ఉందా? లేదా?
కాలేజీలో అటు ఇటు తిరుగుతున్న గౌతమ్..అసలు షార్ట్ ఫిలింలో క్యారెక్టర్ ఉందా లేదా, నేను హీరోగా ఫిక్సయ్యాను, నువ్వే అడ్డుపడుతున్నావ్, టాలెంట్ ని తొక్కేయకురా, నాకు అవకాశం ఇవ్వరా అంటాడు గౌతమ్. అవకాశాన్ని డిమాండ్ చేయకూడదు, మర్యాదగా అడగాలని రిషి చెబుతాడు. సరే నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి నీకు క్యారెక్టర్ ఇస్తాను కానీ నేను చెప్పిన రూల్స్ పాటించాలని షరతులు పెడతాడు. క్యారెక్టర్ ఎలా ఉంటే అలా బిహేవ్ చేయాలి.డైరెక్టర్ గారు చెప్పింది చేయాలి, నువ్వు చేస్తున్న క్యారెక్టర్ మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది.వసుధారకి వీలైనంత దూరంలో నీ పాత్ర ఆగిపోవాలి అంటాడు. నువ్వేంటిరా ఇన్ని కండిషన్స్ పెడుతున్నావ్ అంటే…సరే వేరేవాళ్లతో చేయిస్తాలే అన్న రిషితో వద్దురా బాబు నీ కండిషన్స్ అన్నింటినీ ఒప్పుకుంటాను అంటాడు గౌతమ్.
పోటీలో ఎవరు గెలిచారంటే..?
ఇంకా మేడంతో ..షార్ట్ ఫిలింలో ఆ క్యారెక్టర్ కి గౌతమ్ ని తీసుకోండి అని చెబితే సరే అంటుంది జగతి. వసుధారతో ఫోన్ మాట్లాడుతున్న రిషి..ఇంకా ఏంటి చెప్పు అంటాడు. ఏముంటుంది అంటే.. నీకు ఎన్నిసార్లు లిఫ్ట్ ఇచ్చానో లెక్కెట్టావా అంటే ఇంకా పూర్తిగా లెక్కపెట్టలేదు అంటుంది. మీ లెక్క ఎంత వరకూ వచ్చిందని అడిగితే రేపు చెప్తాలే అంటాడు.మార్నింగ్ నేను వచ్చి పికప్ చేసుకుంటాను రెడీగా ఉంటు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇదంతా వినేసిన గౌతమ్..రేపు పొద్దున్నే నువ్వు వసుధార ఇంటికి వెళతావన్నమాట. రిషి పొద్దున్నే బయలుదేరుతుండగా గుడ్ మార్నింగ్ ఎండీగారూ అంటూ వెనుకే వస్తాడు గౌతమ్. ఏంట్రా అంటే నువ్వు ఎటు వెళితే నీతోపాటే నేనూ వస్తానంటాడు. కానీ నువ్వు నాతో రావడం లేదు నువ్వు వేరేకార్లో వస్తావంట అని చెప్పేసి వెళ్లిపోతాడు.