NewsOrbit
హెల్త్

Mahashivaratri : మహాశివరాత్రి కి ఈ చిన్న పని చేయండి… అద్భుత ఫలితం కలుగుతుంది !!

Share

Mahashivaratri : అమ్మకి,స్వామి కి:
మాఘ మాస శివరాత్రి ‘ మహా శివరాత్రి ’  శివ పార్వతుల ఇరువురికి కలిపి ‘శివులు’ అని పేరు ఆ ఇద్దరికి సంబంధించిన రాత్రి కావడం తో  శివరాత్రి అనేది మరో అర్థం వస్తుంది .   శివరాత్రి రోజు   అమ్మకి,స్వామి కి ఉత్సవం జరుగుతుంది.శివ అంటే  మంగళకరమైన అని అర్ధం  కాబట్టి శివరాత్రి అంటే మంగళ కరమైన రాత్రి అని అర్ధం.

Mahashivaratri :శివపార్వతుల కళ్యాణ మహోత్సవం:

రాత్రి అనేది ప్రాణికోటి  మొత్తం నిద్రపోతూ ఉండే కాలం.. రాత్రి , నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం అని అంటారు. ఆ రాత్రి వేల తానూ మాత్రం మేల్కొని రక్షించే శివుడు  రాత్రి దేవుడు . ఆయన వివాహం కూడా అర్దరాత్రి దాటాక ప్రారంభం అవుతుంది.  ‘మహాశివరాత్రి’ పండుగ రోజునుండి  అప్పటివరకు ఉన్న చలి తగ్గుముఖం పడుతుంది  అని అంటారు.     పిశాచ , భూత ప్రేతాల ను సైతం  తన ప్రేమతో అదుపు చేయగల    శంకరుడు, నెలవంకను శిరోభూషణము  చేసుకుని  భస్మ లేపన సువాసనల మధ్య   కన్నుల పండువగా జరిగే  శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కోసం సంవత్సరం  పాటు ఎన్ని రాత్రులైనా  ఎదురుచూడవలిసిందే.

శివ సాయుజ్య కైలాస ప్రాప్తి  :

శివరాత్రి పర్వదినం  రోజు  మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష వేసుకుని ,   దీపాలను పడమర దిక్కున వెలిగించి, “ఓం నమః శివాయ” అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం కలుగుతుంది అనే నమ్మకం  చాలా మందిలో  ఉంటుంది. ఆ రోజు అర్ధరాత్రి జరిగే లింగోద్భవ సమయం లో శివాభిషేకములు ,స్తోత్ర పారాయణ లతో పూజలు సాగుతూ ఉంటాయి,    ఆలయాల్లో పంచామృతముతో  ఆ మహా దేవునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు  పోతాయి అని  పండితులు  తెలియచేస్తున్నారు. తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, ఇంక ఏవిధమైన  గాని,  ఈ రోజున శక్తి కొలది  ఎవరైతే స్నానము, నమ స్మరణ ,దానము, ఉపవాసము , జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్య కైలాస ప్రాప్తి  కలిగి తీరుతాయి అని అనేక గాధలు  మనకు తెలియచేస్తున్నాయి. కాబట్టి శక్తి అనుసారం ఆ రోజు ఆ శివుడిని పూజించి ధన్యులం అవుదాం.


Share

Related posts

Kidneys: ఈ చిన్న ట్రిక్ తో కిడ్నీలు శుభ్రపరుచుకోవడం సులువే..!!

bharani jella

Second Marriage: సెకండ్ మ్యారేజ్ స్త్రీల ను పెళ్లి చేసుకుంటే  పురుషులకు శృంగారం లో ఈ సమస్యలు వస్తాయా??

siddhu

Disc Problems: ఎముకల సమస్యకు అద్భుతమైన ఇంటి మందు..!!

bharani jella