Sleep : ఒక్క రోజు ఆహారం తీసుకోకపోవడం కన్న ఒక్క రాత్రి నిద్ర లేకపోవడం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.నిద్ర అవసరం మనిషికి అంతగా ఉందని చెప్పాలి . ప్రతి రోజు ప్రతి ఒక్కరు 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. అయితే కొందరు అంత కన్న చాలా తక్కువ సమయం నిద్రపోతుంటే , మరి కొందరు కచ్చితంగా 8 గంటలు నిద్ర కు కేటాయిస్తున్నారు.
కానీ నిజానికి మనిషికి 8 గంటల నిద్ర కూడా సరిపోదని ఓ ప్రముఖ సైంటిస్టు తెలియచేస్తున్నారు. మనం రోజుకు కచ్చితంగా 8 గంటలు మాత్రమే కాదు, మరో 30 నిమిషాల పాటు అదనం గా అంటే మొత్తం ఎనిమిదిన్నర గంటల పాటు నిద్రపోతే మంచిదట.
ఇలా ఎందుకు అనేది కూడా ఆ సైంటిస్టు వివరణ కూడా ఇస్తున్నారు. అదేమిటంటే… మనం ప్రతి రోజు 8 గంటల పాటు నిద్రపోయినా కూడా మరో 30 నిమిషాల పాటు అదనం గా నిద్రపోవడం మంచిదని ఆయన సూచిస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే, రాత్రి పూట మనం పడుకోగానే నిద్ర లోకి వెళ్ళిపోము. అలాగే నిద్ర లేచే ముందు మనకు మెలకువ వస్తుంది. అయినా నిద్రపోయినట్టుగానే కళ్లు మూసుకునే ఉంటాము. అదంతా లెక్కవేసుకోకుండా,మనం 8 గంటల పాటు నిద్ర పోయామని అనుకుంటూ ఉంటాము. కానీ7 గంటల పాటు మాత్రమే మనం పడుకుంటామట. ఇదే విషయాన్ని ఆయన తన పరిశోధనలో తేల్చారు.
కనుక ఎవరైనా ప్రతి రోజు 8 గంటల పాటు నిద్రిస్తున్నామనుకుంటే పొరపాటేనట. మరో 30 నిమిషాలు ఎక్కువగా నిద్ర పోవాలిసిందేనని అలా నిద్ర పోతేనే, కచ్చితంగా 8 గంటల నిద్ర పూర్తవుతుందని, చెబుతున్నారు. అయితే ఉదయం 30 నిమిషాల పాటు అదనంగా నిద్రపోవడం కుదరదు అని అనుకునే వారు మధ్యాహ్నం ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. మధ్యాహ్నం పూట 20 నుంచి 30 నిమిషాల పాటు నిద్రపోతే చాలు.. రోజు పూర్తి చేయవలిసిన 8 గంటల నిద్ర పూర్తవుతుందట. దీని వల్ల చురుగ్గా, ఉత్సహంగా పనిచేయవచ్చని, చెబుతున్నారు. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ సమయానికి అనుగుణంగా రాత్రి అరగంట ముందు పడుకోండి.. లేదా పొద్దున్న అరగంట లేట్ గా లేవండి.. కాదంటే మధ్యాహ్నం పడుకోండి. చురుగ్గా ఉండాలంటే ఎలా చేయక తప్పదు మరి..