ఒకప్పుడు జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్.. సుడిగాలి సుధీర్ అంటే జబర్దస్త్. కానీ.. తర్వాత హైపర్ ఆది వచ్చాడు. సుధీర్ ను మించిపోయాడు. సుధీర్ కన్నా బెస్ట్ స్కిట్లు చేసి అదరగొట్టేశాడు. జబర్దస్త్ లో టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు.

ఇప్పుడు సుధీర్ నే కాదు.. ఏకంగా హైపర్ ఆదిని కూడా మించేశాడు ఇమ్మాన్యుయేల్. మామూలుగా కాదు.. ఏ స్కిట్ లో చూసినా ఇమ్మాన్యుయేలే. జబర్దస్త్ తో పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ ను కూడా ఏలేస్తున్నాడు ఇమ్ము. ఓవైపు ఇమ్ము, వర్ష జంట ఫేమస్ అవ్వడంతో పాటు.. ఇమ్మాన్యుయేల్ జబర్దస్త్ లో హైలైట్ అవుతున్నాడు.
తాజాగా వచ్చిన ఎపిసోడ్ లోనూ సుడిగాలి సుధీర్ స్కిట్ లో ఫుల్ లెంత్ రోల్ చేసి సూపర్ అనిపించాడు. సుడిగాలి సుధీర్ టీమ్ నే డామినేట్ చేసేశాడు ఇమ్మాన్యుయేల్. మనోడి టైమింగ్, పంచ్ లు, డ్యాన్స్.. అన్నీ ప్లస్సే. అందుకే జబర్దస్త్ లో ఒక ఐకాన్ గా నిలిచిపోతున్నాడు. అందుకే.. ఇప్పుడు టీమ్ లీడర్లంతా ఇమ్మాన్యుయేల్ ని తమ టీమ్ లో పెట్టి స్కిట్ చేయాలని తెగ ఆరాటపడుతున్నారు.
నిన్న కాక మొన్న వచ్చి.. మొత్తం జబర్దస్త్ నే ఇమ్మాన్యుయేల్ షేక్ చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. మొత్తానికి ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ టైమ్ నడుస్తోంది. ఏం చేస్తాం.
తాజాగా విడుదలైన సుడిగాలి సుధీర్ స్కిట్ చూస్తేనే తెలుస్తుంది ఇమ్మాన్యుయేల్ స్కిట్ ను వన్ మ్యాన్ షోలా ఎలా నడిపించాడో?