Featured ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

అంతరిక్షంలోకి సమోసా ను పంపిన భారతీయ రెస్టారెంటర్.. ఎక్కడ ల్యాండ్ అయిందో తెలుసుకోండిలా..

Share

భారతదేశం సంప్రదాయాలకు, వంటకాలకు పెట్టింది పేరు.. మన దేశీయ వంటకాలకు పాశ్చాత్య దేశాలలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.. ప్రపంచ దేశాలకు భారతీయ వంటకాల రుచి తెలిసినదే.. విదేశీయులు సైతం మన వంటకాలను ఇష్టంగా లాగించేస్తున్నారు..! సమోసా సాయంత్రం స్నాక్స్ లో ఇది తప్పనిసరి..! ప్రతి రెస్టారెంట్లో ఎక్కువగా అమ్ముడయ్యేవి సమోసా అనడంలో సందేహం లేదు.. అంతే కాదు మోటుపతులు కార్టూన్ లో కూడా సమోసా ప్రత్యేకత సాధించుకుంది.. తాజాగా యూకేలోని ఒక భారతీయ రెస్టారెంట్ ఒక సమోసాను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది.. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది..!

Indian restauranter samosa in space landing on France see the details

అంతరిక్ష ప్రయోగం కోసం ఒక ఆలు సమోసా ను ఉపయోగించారు అంతరిక్షంలో ఎక్కువసేపు ఉండేందుకు సాధారణంగా కంటే ఎక్కువ సేపు వేయించారు. రెండింటిని ఒక పెట్టెలో ఉంచాడు. హీలియం బెలూన్ తో పాటు గోప్రో కెమెరా, జీపీఎస్ ట్రాకర్ ను కూడా ఉంచి మొత్తం పూర్తిగా సిద్ధం చేసి అంతరిక్షంలోకి వదిలాడు. ఈ సమోసా ప్యాకేజీని విమానం తో పాటుగా ప్రయాణించింది. సమోసా ప్రతి కదలికను రికార్డు చేసేలా కెమెరా ను అమర్చారు. ఆకాశంలోకి ఎగిరిన సమోసా ను ట్రాక్ చేసేందుకు జిపిఎస్ ను కూడా అమర్చారు. ఇది బయలుదేరిన ప్రదేశానికి మూడు వందల మైళ్ల దూరంలో ఫ్రాన్స్ లోని కైక్స్ లో ల్యాండ్ అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. కేవలం మూడు రోజుల్లోనే 58 వేల సంపాదించు కోవటం విశేషం.

Indian restauranter samosa in space landing on France see the details

భారతీయ రెస్టారెంట్ యజమాని నీరజ్ గాదర్ సమోసా ని అంతరిక్షంలోకి పంపాలని అనుకొన్నాడు. ఒక సమోసాలు అంతరిక్షంలోకి పంపుతానని జోక్ చేశారు. ఆయన అన్నట్లుగానే అంతరిక్షంలోకి పంపారు. కానీ ఇది అంత సులువుగా ఏమీ జరగలేదు. రెండుసార్లు విఫలమైనప్పటికీ మూడవసారి ఎట్టకేలకు విజయాన్ని సాధించారు. అయితే 2007లో అంతరిక్ష కేంద్రంలో భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా సమోసాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి :కార్ కాదిది.. ఫ్లయింగ్ కార్.. ఒకసారి షికార్ కొట్టాల్సిందే.. 

 


Share

Related posts

MAA: “మా” అధ్యక్ష ఎన్నికలలో బాలయ్య సపోర్ట్ ఎవరికో తెలుసా..??

sekhar

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత.. యాంకర్ రవి ఫోటో పగలగొట్టిన సరియు..!!

sekhar

Extra Jabardasth : మొన్న సుధీర్ రష్మీ, నిన్న ఇమ్మాన్యుయేల్ వర్ష, ఇవాళ రాకింగ్ రాకేశ్ రోహిణి?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar