Nuvvu Nenu Prema: స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారీ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్.. మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇందులో నటించే నటీనటులు కూడా తమ నటనతో యువతను భారీగా మెస్మరైజ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సీరియల్ లో హీరోయిన్ పద్మావతి అక్క క్యారెక్టర్ పోషిస్తున్న అను అలియాస్ దోకల నవ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతోనే మెస్మరైజ్ చేసే ఈ ముద్దుగుమ్మ సీరియల్లో తన నటనతో అమాయకత్వంతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

అను కాస్త సమయం దొరికితే చాలు ఎక్కువగా తన సమయాన్ని సోషల్ మీడియాకే కేటాయిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రకరకాల పాటలకు రీల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమా నుంచి ట్రెండింగ్ లో ఉన్న సమ్మోహనుడా అనే పాటకు రీల్ చేసి మరొకసారి అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ పాట ఎంతలా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ పాటకు రీల్ చేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అను కూడా ఈ పాటకు రీల్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ శారీలో కైపెక్కించే చూపులతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ రీల్ చూసిన నెటిజన్లందరూ ఆశ్చర్యపోవడమే కాదు ఈమె అందానికి మోహితులవుతున్నారు. మొత్తానికైతే అను షేర్ చేసిన ఈ రీల్ నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. ఇక అను కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ తో పాటు పాటకు తగ్గట్టుగా మెలికలు తిరుగుతూ అందరిని ఆకట్టుకుందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ రీల్ కాస్త తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసుకోగా.. అది చాలా వైరల్ గా మారుతుంది.