IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

IPL 2021 Chennai super kings gets shock
Share

IPL 2021 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో మళ్లీ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ధోనీ సారథ్యంలో ఈ జట్టు గత సీజన్ మినహాయిస్తే ప్రతిసారి సెమీఫైనల్స్ ఆడిన ఘనత సాధించింది. ఈ జట్టు పేపర్ పై బలంగా లేకపోయినా ధోనీ కెప్టెన్సీ వల్ల టోర్నమెంట్లో చెలరేగుతూ ఉంటుంది. కానీ రెండు సంవత్సరాల నుండి చెన్నై జట్టులో ఆ పటిత్వం లోపించింది.

 

IPL 2021 Chennai super kings gets shock
IPL 2021 Chennai super kings gets shock

మంచి యువ ఆటగాళ్లు కరువయ్యారు. సీనియర్లు చేతులెత్తేస్తున్నారు .గత సీజన్లో పేలవ పెర్ఫార్మెన్స్ తో టేబుల్ అడుగున ఉన్న ధోనీ జట్టు ఈ సీజన్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఇలాంటి సమయంలో వారికి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్ వుడ్ టోర్నీ నుండి దూరం అయ్యాడు. ఐపీఎల్ బాయో బబుల్ ను భరించే మానసిక శక్తి తనికి లేదంటూ హేజిల్ వుడ్ సీజన్ నుండి తప్పుకోవడం గమనార్హం.

అయితే ఇటువంటి సమాచారం అతను ముందే ఇవ్వకుండా కేవలం ఐపీఎల్ ప్రారంభమయ్యేందుకు పది రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చెట్టుకి భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అతని స్థానంలో వారు ఇంకొక విదేశీ ప్లేయర్ ను వెతుక్కోవాల్సిన అవసరం ఉంది.

అంతే కాకుండా మరొక విదేశీ ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడీ కూడా అందుబాటులో లేడు. అతనికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి. మొదటి కొద్ది మ్యాచ్ లు అతను కూడా జట్టుకి దూరం అవుతాడు. ఇలాంటి సమయంలో మంచి పదునైన పేస్ బౌలర్ లేకుండా చెన్నై మ్యాచ్ లు ఆడాల్సి వస్తుంది అని అర్థమవుతుంది. మరి ధోనీ అనుభవం పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.


Share

Related posts

దుబ్బాక ఉపఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. ఎవరో తెలుసా?

Varun G

అద్భుతమైన వంటింటి చిట్కాలు!!

Kumar

‘ప్రజలు తిరగబడతారు,జాగ్రత్త!’

somaraju sharma