ఏపీ మించిపోతుందనే ప్రధాని ‘ఆక్రోశం ’

అమరావతి, జనవరి 02 : గుజరాత్ కన్నా ఆంధ్రప్రదేశ్ అధిక్యత సాధించడకూడదనేదే ప్రధాని మోదీ ఆక్రోశ మని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రధానమంత్రి తనపైన చేసిన వ్యాఖ్యలపైన చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏపీకి సహకరిస్తే అభివృద్ధిలో ముందడుగు వేస్తామన్న భయంతోనే ప్రధాని రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారన్నారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న అనుమానంతో ప్రధాని రాష్ర్ట పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు.
బుధవారం సీఎం పార్టీ నాయకులతో టెలీకాన్ఫ్ రెన్స్ నిర్వహించి జన్మభూమి, మా ఊరు కార్యర్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మహాకూటమి విఫలంపై భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను సీఎం త్రిప్పికొట్టారు. హైకోర్టు తరలింపు ప్రక్రియ గడువివ్వకుండా తరలించారు. దేశంలో తలెత్తుతున్న మత వివాదాల్లో బిజెపి జోక్యం చేసుకుంటోందన్నారు. శబరిమల ఆలయ వివాదంలో ఒక విధంగా, ట్రిపుల్ తలాక్ వివాదంలో మరో విధంగా బిజెపి వ్యవహరిస్తోందన్నారు.
తన కేసులనుంచి విముక్తి కోసం వైసీపీ అధినేత జగన్ అధికారం కోసం తాప్రతయపడుతున్నారనీ, అందుకోసం ప్రధాని మోదీ, తెలంగాణా సీఎం కేసీఆర్‌తో జతకడుతున్నారు. రాష్ర్టానికి అన్యాయం చేస్తున్నవారిపైన తేదాపా పోరాటం చేస్తుంటే, జగన్ వారితో స్నేహం చేయడం దారుణమన్నారు. ప్రధాని మోదీతోపాటుగా కెసిఆర్ జగన్‌లతో పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి చేయకపోయినా కేసిఆర్ విజయం సాధించారనీ, అందరికీ కంటే మిన్నగా అభివృద్ధి చేసిన మనం వచ్చే ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించాలని పార్టీ నేతలకు నిర్ధేశించారు.