చివరి టెస్టుకు భారత్ సమాయుత్తం

సిడ్నీ(ఆస్ర్టేలియా), జనవరి 2: ఆస్ర్టేలియాలో అతిధ్యజట్టుపై టెస్టు సీరీస్‌లో 2-1తో ఆధిక్యంతో ఉన్న టీం ఇండియా గురువారం నుంచి చివరిదైన నాలుగో టెస్టుకు సమాయంత్తం అవుతోంది. ఈ టెస్టు జట్టకు 13 మందితో కూడిన భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది.
తొలి టెస్టులో గాయపడిన అశ్విన్ రెండు, మూడు టెస్టులకు దూరం అయ్యాడు. మెల్‌బోర్న్ టెస్టులో జడేజా రవీంద్ర జడేజా అశ్విన్ స్థానంలో భర్తీ చేసే అవకాశంవుంది. చివరి టెస్టులో స్పిన్నర్ అశ్వీన్ ఆడేది అనుమానమేనని జట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపారు. అశ్వీన్ లేకపోవడం పెద్ద లోటుగా పేర్కొన్నారు. రోహిత్‌శర్మ ముంబైకి రావడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులోలేడు.
భారత జట్టు : విరాట్ కోహ్లీ(కెప్టెన్). రహానే ( వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, రిషబ్‌పంత్, జడేజా, కేదార్ యాదవ్, అశ్విన్,షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్.